పెళ్లి చేసుకున్నామని నా కొడుకు చెప్పాడు.. నిన్న చేసింది తప్పే కానీ.. : నవీన్ రెడ్డి తల్లి సంచలన కామెంట్స్

Published : Dec 10, 2022, 02:01 PM IST
పెళ్లి చేసుకున్నామని నా కొడుకు చెప్పాడు.. నిన్న చేసింది తప్పే కానీ.. : నవీన్ రెడ్డి తల్లి సంచలన కామెంట్స్

సారాంశం

హైదరాబాద్ శివార్లలో యువతి  కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి యువతిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్ శివార్లలో యువతి  కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి యువతిని కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి తల్లి నారాయణమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. యువతి ఇంటికి వెళ్లి తన కొడుకు చేసింది తప్పేనని చెప్పిన నారాయణమ్మ.. అంతకుముందు జరిగిన విషయాలను కూడా చూడాలని కోరారు. వారిద్దరు రెండేళ్లుగా ప్రేమించుకున్నారని తెలిపారు. యవతితో పెళ్లి అయిందని తన కొడుకు చెప్పాడని.. అయితే పెళ్లి జరిగిందో, లేదో తనకు తెలియదని చెప్పారు. 

యువతి తల్లిదండ్రులు తొలుత నవీన్ తో పెళ్లి చేస్తామని చెప్పారని, ఆ తర్వాత మోసం చేశారని ఆరోపించారు. తన కొడుకుని పైసల కోసం యువతి కుటుంబం వాడుకుందని ఆరోపించారు. నవీన్ రెడ్డికి మంచి పెళ్లి సంబంధాలు వచ్చాయని చెప్పారు. అయితే వారిద్దరికి పెళ్లి అయిందనే తన బంధువులు కూడా భావించేవారని చెప్పారు. 

Also Read: ప్రేమ, పెళ్లి పేరుతో నవీన్ రెడ్డి నా కూతురిని వేధించాడు.. పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు..

తన కొడుకు ఎప్పుడూ ఫోన్ చేసి బయట ఉన్నానని  చెప్పేవాడని తెలిపారు. కరోనా సమయంలో కూడా ఆమెను కాలేజ్‌కు తీసుకెళ్లేవాడని  చెప్పారు. ఆ యువతి  కూడా నవీన్ రెడ్డిని ప్రేమించిందని.. తమ ఇంటికి కూడా వచ్చిందని చెప్పారు. యువతి ఇప్పుడు ఎందుకిలా మారిపోయిందో తెలియదని తెలిపారు. అయితే ఆమె మనస్ఫూర్తిగా కోడలిగా వస్తే అంగీకరిస్తానని చెప్పారు. 

Also Read: ఆదిభట్లలో నిశ్చితార్థం రోజున యువతి కిడ్నాప్‌ ... అసలు ఎవరీ నవీన్‌రెడ్డి..!

ఇదిలా ఉంటే.. తన కూతురుతో పెళ్లి అయిందని నవీన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని యువతి దామోదర్ రెడ్డి. తన కూతురితో కలిసి దిగిన ఫొటోలను నవీన్ రెడ్డి  పెళ్లి జరిగిందనే ప్రచారానికి వాడుకున్నారని విమర్శించారు. తన సొంత గ్రామంలో కూడా తనను బద్నామ్ చేసే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. తన కూతురును సొంతం చేసుకోవాలనే  నవీన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఉదయం తన కూతురు నిశ్చితార్థానికి కొన్ని గంటల ముందు నవీన్ రెడ్డి తన కూతురును అపహరించి ఉదయం 11:30 గంటలకు కారులో తీసుకెళ్లారని చెప్పారు. అడ్డుకోవడానికి యత్నించిన తనపై ఇనుప రాడ్‌తో తలపై కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయానని తెలిపారు. తాను తేరుకునే సమయానికి తన కూతురు కనిపించలేదని అన్నారు. పలువురు కుటుంబ సభ్యులపై నవీన్ రెడ్డితో వచ్చినవారు దాడి  చేశారని ఆరోపించారు. ఆ సమయంలో పోలీసులకు ఫోన్ చేసిన కూడా స్పందించలేదని చెప్పారు. ఇక, ఈ వ్యవహారంలో ఇరు కుటుంబాలకు సంబంధించిన  వాదనలు భిన్నంగా పోలీసులు అసలు వాస్తవాలు ఏమిటనేది వెలికి తీసే పనిలో పడ్డారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panic at Hyderabad Gas Stations: యుద్ధం ఎఫెక్ట్! హైదరాబాద్‌లో గ్యాస్ కోసం బారులు | Asianet Telugu
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు ప్రజలకు సజ్జనార్ విజ్ఞప్తి | Asianet News Telugu