అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ కుక్కలు మొరుగుతున్నాయని అన్నారు. కేటీఆర్ నుంచి సుమన్ దాకా ఎగసిపడుతున్నాయని పేర్కొన్నారు.
Addanki Dayakar: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగసి.. ఎగసి పడుతున్నాయని అన్నారు. కేటీఆర్ నుంచి సుమన్ దాకా ఎగసిపడుతున్నాయని ఫైర్ అయ్యారు. ప్రజలు చెప్పులతో కొట్టినా వీరికి ఇంకా బుద్ధి రాలేదని పేర్కొన్నారు. ఇంకా వారికి బుద్ధి వచ్చేలా లేదని అన్నారు.
ప్రజలను దోచుకునే దొంగలకు, పరిపాలన, అందుకు సంబంధించిన అంశాలు తెలియక రాజకీయంగా చచ్చిపోయారని అద్దంకి అన్నారు. ఒకడేమో మూడు నెలలకు పోతదంటడూ.. మరొకడేమో ఆరు నెలలకు ప్రభుత్వం పోతదని అంటాడని ఆగ్రహించారు. ఇంకోడేమో ఎప్పుడు పోతదో తెలియదంటాడని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ కుక్కలు మొరుగుతున్నాయ్.
-- అద్దంకి దయాకర్
KCR's Dogs are Barking.
-- Addanki Dayakar pic.twitter.com/E4umC61AqE
అసలు బీఆర్ఎస్ నేతలు ఇంత రెచ్చగొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు సంయమనం పాటిస్తున్నారో.. దాని వెనుక ఉన్న వ్యూహం ఏమిటో వీరికి అంతుచిక్కడం లేదని అద్దంకి దయాకర్ అన్నారు. ప్రజల ముందు వారిని ముద్దాయి గా పెట్టాలనే సీఎం ప్రయత్నాలు వారికి అర్థం కాలేదని తెలిపారు. రెండు నెలలకే తట్టుకోలేకపోతున్న బీఆర్ఎస్ నేతలను చూస్తే.. వారిలో ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం అవుతున్నదని కామెంట్ చేశారు.
Also Read: PM Modi: మరోసారి నెహ్రూ పై మండిపడ్డ ప్రధాని మోడీ.. ‘భారతీయుల పై వారికి విశ్వాసమే లేదు’
వారిని తన్ని తరిమేసినా బుద్ధి వచ్చేలా లేదని అద్దంకి దయాకర్ అన్నారు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తన్ని తరిమేసే పరిస్థితులు వస్తాయి తస్మాత్ జాగ్రత్త అంటూ పేర్కొన్నారు.