Hyderabad: ఆహ్వాన పత్రికలో ఆర్టికల్స్, యాక్ట్‌లు.. జడ్జీ మ్యారేజ్ ఇన్విటేషన్ అంటే ఇలా ఉండాలి మరీ!

By Mahesh K  |  First Published Apr 30, 2023, 5:37 PM IST

దేవరకొండ న్యాయమూర్తి అజయ్ ఉల్లమ్ వివాహ ఆహ్వాన పత్రిక వినూత్న రీతిలో ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. సాంప్రదాయ రీతిలో ఇన్విటేషన్ కార్డులో పేర్కొనే పదాలు కాకుండా పూర్తిగా లీగల్ టర్మినాలజీలో ఈ వివాహ పత్రిక ఉన్నది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 


హైదరాబాద్: అది వివాహ ఆహ్వాన పత్రిక. కానీ, తెలుగు సంవత్సరం పేరు, ముహూర్తం, చిరంజీవి, చిలసౌలు.. ఇలా ఏవీ కనిపించలేవు. సాంప్రదాయ వివాహ ఆహ్వాన పత్రికకు పూర్తిగా దూరంగా.. ఒక కొత్త విధానంలో ఆ మ్యారేజీ ఇన్విటేషన్ కార్డు ఉన్నది. పైపెచ్చు.. ఆ వివాహ ఆహ్వాన పత్రిక చదివితే.. రాజ్యాంగం చదవడం మొదలుపెట్టామా? అనే ఫీలింగ్ వస్తుంది. అందులో అధికరణాలు, చట్టాలూ పొందుపరిచి ఉండటమే ఇందుకు కారణం. ఆహ్వాన పత్రికే నోటీసు అనే పదంతో మొదలైంది.

నల్గొండ జిల్లాలోని దేవరకొండ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జీ అజయ్ ఉల్లం వివాహ ఆహ్వాన పత్రిక ఇది. ఆ ఇన్విటేషన్ కార్డు చదివితే.. జడ్జీ మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు అంటే ఆ మాత్రం ఉండాలి మరీ అన్నట్టుగా ఉన్నది. ఈ పెళ్లి పత్రికను అర్థం చేసుకోవాలంటే కాసింతైనా రాజ్యాంగ అవగాహన ఉండాల్సిందే మరీ. సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ ప్రాథమిక హక్కు గురించి తెలియనివారికీ అవగాహన ఏర్పడుతుంది. ఇంతకీ ఆ లగ్న పత్రికలో ఏమున్నదో ఓ సారి చూద్దాం.

Latest Videos

undefined

వేడుకల కోసం నోటీసు ఇచ్చినట్టుగా ఆ పత్రిక మొదలవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 పరిధిలోకి వచ్చే జీవించే హక్కులో వివాహ హక్కూ ఒక అంశం. ‘ఈ ప్రాథమిక హక్కును వినియోగించే సమయం ఆసన్నమైంది. 2023 మే 3వ తేదీన (బుధవారం) ఈ హక్కను వినియోగిస్తున్నాం’ అని ఆహ్వాన పత్రికలో తొలి వాక్యాలు ఉన్నాయి.

Also Read: వైరల్ గా ఖమ్మం జిల్లా ట్రైనీ కలెక్టర్ వెడ్డింగ్ ఇన్విటేషన్.. కవితలో లవ్‌ స్టోరీ చెబుతూ.. వెరైటీగా కార్డ్...

‘ఆర్టికల్ 19(1)(బీ) కింద శాంతియుతంగా ఒక చోట చేరే హక్కు కింద మీరు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పేర్కొన్నారు. పెళ్లి సమయం, వేదికల వివరాలను పొందుపరిచిన తర్వాత రిసెప్షన్ వివరాలను, అనంతరం, పెళ్లి కొడుకు, పెళ్లి కూతరుల పేర్లు, వివరాలు తెలిపారు.

హిందూ వివాహ చట్టం 1955 కింద మే 3వ తేదీన తాము ఒక్కటవ్వాలని పరస్పరం నిర్ణయించుకున్నట్టు చివరి ప్యారాలో రాసుకొచ్చారు. జీవితాంతం ప్రేమ, స్వేచ్ఛలతో ఉండాలని అంగీకరించుకున్నట్టు తెలిపారు. కాబట్టి, ఈ వివాహ వేడుకకు మీరంతా కుటుంబ సమేతంగా ప్రత్యక్షంగా హాజరుకావాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడవు. ఏడు అడుగు లతో పెళ్లి జరుగుతుంది అంటూ చివరగా కోట్ పేర్కొన్న ఈ మ్యారేజీ ఇన్విటేషన్ కార్డు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

click me!