ఇప్పటికైనా తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయానికి వస్తారేమోనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: వాస్తు ప్రకారమే సెక్రటేరియట్ కేసీఆర్ కట్టుకున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆదివారంనాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కొత్త సచివాలయ నిర్మాణంతోనైనా కేసీఆర్ సచివాలయానికి వస్తారని ఆశిస్తున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సచివాలయ నిర్మాణ ఖర్చు పేరుకు వెయ్యి కోట్లు అని చెబుతున్నారన్నారు.. కానీ రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని ఆయన విమర్శించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ఆయన ప్రస్తావిస్తూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు. పేదలకు ఇళ్లు, యువతకు ఉద్యోగాలు ఒవ్వకుండా సచివాలయం నిర్మించారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. .
also read:అన్ని రంగాల్లో దూసుకుపోవడమే తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక: కేసీఆర్
తెలంగాణ సచివాలయాన్ని ఇవాళ మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 2019 జూన్ మాసంలో కొత్త సచివాలయ నిర్మాణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. సచివాలయం కూల్చివేతను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకంచాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు సచివాలయ నిర్మాణ పనులకు అనుమతిని ఇచ్చిన తర్వాత సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. కూల్చివేత పనులు ప్రారంభమైన తర్వాత కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో సచివాలయ నిర్మాణ పనులను నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి సచివాలయ నిర్మాణ పనులను ప్రారంభించారు.
పనులను త్వరగా పూర్తి చేసేందుకు మూడు షిప్టులలో పనులు నిర్వహించారు. కేసీఆర్ పుట్టిన రోజు సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయమై విమర్శలు వచ్చాయి కొందరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కేసీఆర్ పుట్టిన రోజు నాటికి సచివాలయ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యే పరిస్థితులు కన్పించలేదు. దీంతో సచివాలయ నిర్మాణ పనులను ఏప్రిల్ 30వ తేదీన ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు.