
తెలంగాణలో మూడు పోలీస్ కమీషనరేట్ల విభజనపై జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఏసీపీ, డీసీపీ, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ జీవోలో పేర్కొన్నారు. కొత్తగా 40కి పైగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ జీవోలో ప్రస్తావించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో 2 చొప్పున డీసీపీ పోస్టులను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.