Disha Case : ఎన్ కౌంటర్ మానసిక స్థితి సరిగాలేదు.. అందుకే ఆ వివరాలు పేర్కొనలేకపోయా...

By AN TeluguFirst Published Oct 26, 2021, 10:08 AM IST
Highlights

నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు తమ ఆయుధాలు లాక్కొన్నారని, కళ్లలో మట్టి చల్లి కాల్పులు జరపడంతోనే తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని Surender పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే Encounter case నమోదు చేశారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత మానసిక స్థితి బాగాలేక, తదనంతర వివరాలు సరిగా నమోదు చేయలేకపోయానని అప్పటి షాద్ నగర్ ఏసీపీ సురేందర్ వెల్లడించారు. disha rape case నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ జరుపుతున్న సిర్పుర్కర్ కమిషన్ ఎదుట సోమవారం ఆయన హాజరయ్యారు. 

నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లినప్పుడు తమ ఆయుధాలు లాక్కొన్నారని, కళ్లలో మట్టి చల్లి కాల్పులు జరపడంతోనే తాము ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని Surender పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే Encounter case నమోదు చేశారు. 

అయితే, ఆ ఫిర్యాదులో కానీ, తర్వాత దాఖలు చేసి Affidavit లో కానీ నిందితులు మట్టి చల్లినట్లు, కాల్పులు జరిపినట్లు ఎందుకు పేర్కొనలేదని కమిషన్ ప్రశ్నించింది. 

ఆ ఎన్ కౌంటర్ తర్వాత తన మానసికస్థితి బాగాలేకే వాటిని పేర్కొనలేకపోయానని ఏసీపీ చెప్పారు. ముందు ఎవరు మట్టి చల్లారు? ఎవరెవరి కళ్లలో మట్టి పడింది? ఎవరు కాల్పులు జరిపారని కమిషన్ ప్రశ్నించగా.. చీకటిగా ఉండటంతో సరిగా చూడలేకపోయామని ఆయన బదులిచ్చారు.

నిందితులను భయపెట్టే ఉద్దేశంతో కాల్పులు జరపమని నా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశా. బృందంలోని లాల్ మదార్ తొలుత కాల్పులు జరిపాడు. మాతోపాటు సాక్షులూ ఉన్నారు. వారిని కూడా రక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే శబ్దం వస్తున్న దిశగా కాల్పులు జరపమని చెప్పా.. అని సురేందర్ పేర్కొన్నారు. 

దిశ సంఘటనకు నేటికి ఏడాది.. గుర్తొస్తే.. గుండెలు మెలిపెడుతుంది...

సిర్పూర్కర్ కమిషన్ విచారణ 
ఇదిలా ఉండగా...దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పూర్కర్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. ఆగస్ట్ 26 నుండి 28 వరకు ఈ కేసులో 18 సాక్షులను విచారించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు అధికారిగా ఉన్న డీసీపీ నరేందర్ రెడ్డిని కమిషన్ విచారించింది.

ఎన్ ‌కౌంటర్ కు సంబంధించిన వివరాలతో పాటు సిట్ సమర్పించిన నివేదిక గురించి కమిషన్ ప్రశ్నించింది. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులను కూడా  కమిషన్ విచారించింది. ఈ ఎన్‌కౌంటర్ లో మరణించిన నిందితుల కుటుంబసభ్యులను కూడ కమిషన్ విచారించి వివరాలు సేకరించింది.

 2019 డిసెంబర్ 6వ తేదీ ఉదయం దిశ హత్యకు గురైన చోటే ఈ నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.  ఈ విషయమై సుప్రీంకోర్టు  విచారణకు కమిషన్ ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా కమిషన్ విచారణ ఆలస్యమైంది. కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో  కమిషన్ మరోసారి విచారణను ప్రారంభించింది. 

 దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో  అప్పటి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఎన్ కౌంటర్ పై ప్రజా సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఉన్నత న్యాయస్థాంన కమిషన్ ను ఏర్పాటు చేసింది.

ఆ రోజు ఏం జరిగింది...
కాగా, 2019 నవంబర్‌ 27 రాత్రి  8.30 గంటలకు శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి పక్కన ఈ ఘటన జరిగింది. స్కూటీ పంక్చర్ చేసి దిశను దారిమళ్లించారు నలుగురు నిందితులు. ఆమెను బలవంతంగా ఓ పాడు పడిన ప్రహరి పక్కకు తీసుకెళ్ళి దారుణంగా సామూహిక అత్యాచారం జరిపారు. 

ఈ ఘటనలో ఆమె చనిపోగా, విగత జీవిగా పడి ఉన్న ఆమెను అర్ధర్రాతి లారీలో తీసుకెళ్ళి షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి బైపాస్‌ వంతెన కింద దహనం చేశారు. డిసెంబర్‌ 28న  తెల్లవారే సరికి దిశ పట్ల జరిగిన దారుణం హైదరాబాద్ ను వణికించింది. 

తనకు భయమేస్తుందని చెల్లికి ఫోన్ చేసి మాట్లాడిన దిశ ఆడియో విన్న ప్రతొక్కరినీ కన్నీరు పెట్టించింది. ఆ రోజు రాత్రే నిందితులు ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 

click me!