మద్యం తాగి వేధింపులు.. తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే..!

Published : Oct 26, 2021, 09:28 AM ISTUpdated : Oct 26, 2021, 09:36 AM IST
మద్యం తాగి వేధింపులు.. తట్టుకోలేక భార్య ఏం చేసిందంటే..!

సారాంశం

ఇటీవలే చర్లపల్లి జైలు నుంచి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రోజూ మద్యం సేవించి.. అనుమానంతో ఆమెను వేధించేవాడు. పీకలదాకా తాగి ఆమెను దారుణంగా కొట్టేవాడు. 

ప్రతిరోజూ మద్యం సేవించి వేధింపులకు గురిచేస్తున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేసింది. రోజురోజుకీ అతని వేధింపులు పెరిగిపోతుండటంతో తట్టుకోలేక హత్య చేసింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

Also Read: కారణమిదీ:నిజామాబాద్ కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

పూర్తి వివరాల్లోకి వెళితే.. సీఐ నవీన్ కుమార్ ఈ  ఘటనకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. రంగంపల్లికి చెందిన దుర్గం నర్సింహులు(46) నేర చరిత్ర కూడా ఉంది. ఇటీవలే చర్లపల్లి జైలు నుంచి వచ్చాడు. అప్పటి నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రోజూ మద్యం సేవించి.. అనుమానంతో ఆమెను వేధించేవాడు. పీకలదాకా తాగి ఆమెను దారుణంగా కొట్టేవాడు. 

Also Read: మెదక్ జిల్లాలో విషాదం.. అక్క పెళ్లికి ముందు రోజుకు చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో కనిపించిన తమ్ముడు.

ఆదివారం అర్థరాత్రి కూడా అతను విపరీతంగా తాగి వచ్చి... నిద్రపోతున్న భార్యను లేపి మరీ ఆమెపై దాడి చేశాడు.చంపేస్తానంటూ బెదిరించాడు. అనంతరం అతను నిద్రపోయాడు. దీంతో.. భర్త తనను చంపుతాడేమోననే భయం ఆమెలో పెరిగిపోయింది. ఈ క్రమంలో భార్య హంసమ్మ.. నిద్రపోతున్న భర్త నర్సింహులు పై బండరాయితో మోది కొట్టి  చంపేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ