మ్యాచ్‌లలో ఆడించేందుకు లంచం.. ఏసీబీ వలకు చిక్కిన కాంటినెంటల్‌ క్రికెట్ క్లబ్‌ వైస్‌ ప్రెసిడెంట్

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 12:46 PM IST
Highlights

హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌  క్రికెట్ క్లబ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అలియాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. శ్రీనివాస్‌ను నల్లకుంటలోని ఆయన ఇంట్లో నుంచి అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌  క్రికెట్ క్లబ్‌ వైఎస్‌ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అలియాస్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. శ్రీనివాస్‌ను నల్లకుంటలోని ఆయన ఇంట్లో నుంచి అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. అండర్‌-19 వినూ మన్కడ్‌, కూచ్‌ బెహార్‌ టోర్నమెంట్లలో అన్ని మ్యాచ్‌ల్లో తన కొడుకుని ఆడిస్తానని చెప్పి శ్రీనివాస్‌ తన వద్ద నుంచి రూ.9 లక్షలు లంచంగా తీసుకున్నాడని లక్ష్మణ్ రావు అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు  చేశారు. దంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. శ్రీనివాస్‌ ఇంట్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హెచ్‌సీఏ సెలక్షన్ కమిటీ సభ్యులు, సెక్రటరీలను ప్రభావితం  చేసేందుకు శ్రీనివాస్ లంచం తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. 
 

click me!