భద్రాచలం ఆలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూజలు

By narsimha lodeFirst Published Dec 28, 2022, 12:09 PM IST
Highlights

భద్రాచలంలో  సీతారామస్వామి ఆలయంలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  ివాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఖమ్మం:భద్రాచలంలో  సీతారామచంద్రస్వామిని రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  బుధవారంనాడు  దర్శించుకున్నారు. భద్రాచలం ఆలయంలో  రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు.భద్రాచలంలో  భారత రాష్ట్రపతికి సాంప్రదాయ బద్దంగా పూర్ణ కుంభం, మేళతాళాలతో వేద మంత్రోత్సవాలతో స్వాగతం పలికారు.  ఆలయంలో మూల వరులకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీతాయారు అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆలయంలో వైదిక సిబ్బంది వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం భద్రాద్రి దేవస్థానం తరపున రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి  సత్యవతి రాథోడ్  పట్టు వస్త్రాలు అందించారు. అంతకుముందు  రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ద్వారా  రూ. 41.38 కోట్లతో  చేపట్టనున్న పనులకు రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము  శంకుస్థాపన చేశారు. 

రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,  రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్  పార్ల మెంటు సభ్యులు మాలోత్ కవిత, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పి చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాచలం శాసనసభ్యులు పోడెం వీరయ్య, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఐజీ నాగిరెడ్డి,  జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డా వినీత్, పర్యాటక శాఖ ఎండి మనోహర్, వేదపండితులు స్థలసాయి, మురళి, గోపి, ప్రధాన అర్చకులు విజయరాఘవన్, రామస్వరూప్ తదితరులు న్నారు.

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల  26వ తేదీన హైద్రాబాద్ కు వచ్చారు.  హైద్రాబాద్ కు చేరుకున్న వెంటనే ఆమె శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. శ్రీశైలంలో మల్లికార్జునస్వామిని దర్శించుకున్న తర్వాత సాయంత్రం ఆమె తిరిగి  హైద్రాబాద్  కు చేరుకున్నారు.  హైద్రాబాద్ లో  రాష్ట్రపతికి  గవర్నర్ తమిళిపై సౌందర రాజన్,  సీఎం కేసీఆర్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలువురు మంత్రులు స్వాగతం పలికారు.  అదే రోజు సాయంంత్రం రాష్ట్రపతి  టూర్  ను పురస్కరించుకొని  రాజ్ భవన్ లో  గవర్నర్  తమిళిపై సౌందరరాజన్  విందు ఇచ్చారు. ఈ విందుకు  సీఎం కేసీఆర్ దూరంగా  ఉన్నారు.  

నిన్న హైద్రాబాద్ నగరంలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. నిన్న ఉదయం కేశవ్ మెమోరియల్  విద్యాసంస్థల్లో  విద్యార్ధులతో  ఆమె ముఖాముఖిలో పాల్గొన్నారు.  సాయంత్రం  నారాయణమ్మ కాలేజీలో పర్యటించారు. అంతేకాదు  నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన  కార్యక్రమంలో   రాష్ట్రపతి పాల్గొన్నారు.ఇవాళ ఉదయం  రాష్ట్రపతి  ముర్ము భద్రాచలం  ఆలయానికి  చేరుకున్నారు.  భద్రాచలానిికి రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో  లెఫ్ట్ పార్టీల నేతలను  పోలీసులు ముందస్తుగా  అరెస్ట్  చేశారు.

click me!