బీఆర్ఎస్‌లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విచారణ: సీబీఐని కోరనున్న రేవంత్ రెడ్డి

By narsimha lode  |  First Published Dec 28, 2022, 12:37 PM IST

బీఆర్ఎస్ లో చేరిన  12 మంది  కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా విచారణ చేయాలని సీబీఐని కోరాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.ఈ విషయమై  సీబీఐకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి  ఇవాళ ప్రకటించారు. 


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో విజయం సాధించి  బీఆర్ఎస్ లో చేరిన  12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై విచారణ జరపాలని  కాంగ్రెస్ పార్టీ డిమాండ్  చేస్తుంది.  ఈ విషయమై సీబీఐకి కూడ ఫిర్యాదు చేయనుంది. పార్టీ మారిన తర్వాత  ఎమ్మెల్యేలకు  ఏ రకమైన లబ్ది కలిగిందనే విషయాలపై కూడా   కాంగ్రెస్ నేతలు సీబీఐకి వివరించే అవకాశం ఉంది.

ఈ ఏడాది అక్టోబర్  26వ తేదీన మొయినాబాద్ ఫాం హౌస్ లో  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ను ప్రలోభాలకు గురి చేస్తూ ముగ్గురు అరెస్టయ్యారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది.  ఈ నేపథ్యంలో  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు  బీఆర్ఎస్ లో చేరిన అంశాన్ని కూడా  విచారణ చేయాలని   రేవంత్ రెడ్డి  సీబీఐకి ఫిర్యాదు చేయనున్నారు. 

Latest Videos

undefined

2018 ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన  ఎమ్మెల్యేల్లో  12 మంది  పార్టీని వీడి బీఆర్ఎస్ లో  చేరారు.  బీఆర్ఎస్ లో  కాంగ్రెస్ శాసనససభపక్షాన్ని  విలీనం చేస్తున్నట్టుగా  ప్రకటించారు.  బీఆర్ఎస్ లో  చేరిన తర్వాత  కొందరు ఎమ్మెల్యేలకు రాజకీయమైన పదవులు దక్కాయి.  అంతేకాదు  ఆర్ధికంగా  ఏ రకమైన లబ్ది జరిగిందనే విషయాాలను కూడా సీబీఐకి అందించాలని ఆ పార్టీ భావిస్తుంది.  2014-19 మధ్య కాలంలో కూడా  టీడీపీ, కాంగ్రెస్  పార్టీలకు చెందిన  ఎంపీలు,ఎమ్మెల్యేలు  ఆ పార్టీని వీడి  బీఆర్ఎస్ లో  చేరారు.  

ఈ విషయమై  కోర్టుల్లో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.మొయినాబాద్  ఫాం హౌస్  కేసును  సీబీఐ విచారణకు ఆదేశిస్తూ  హైకోర్టు ఆదేశాలు జారీ చేసినందున   కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో  చేరిన విషయమై విచారణ చేయాలని  సీబీఐని కోరుతూ  వినతిపత్రం ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ఇవాళ ప్రకటించారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుతో తమకు సంబంధం లేదంటూనే   సీబీఐ విచారణను బీజేపీ ఎందుకు కోరిందని రేవంత్ రెడ్డి  ప్రశ్నించారు.  

also read:వ్యక్తిగత సమస్యలపై చర్చ వద్దు: గాంధీ భవన్ లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి
 
మొయినాబాద్  ఫాం హౌస్  కేసుపై హైకోర్టు తీర్పును అప్పీల్ చేయాలని సిట్ భావిస్తుంది.  డివిజన్ బెంచ్ తీర్పు తర్వాతే   ఈ కేసును సీబీఐ దర్యాప్తు  చేసే అవకాశం ఉంది. మొయినాబాద్ ఫాం హౌస్ కేసు  ఘటన దేశ వ్యాప్తంగా  సంచలనం కలిగించింది. ఈ తరుణంలో  కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలను  బీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయమై   విచారణ జరపాలని  కోరుతామనడం  చర్చకు దారి తీసింది.   

click me!