
హైదరాబాద్ జల్‌పల్లి మున్సిపల్ కమీషనర్ జీపీ కుమార్ ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు సుమారు రూ.20 కోట్ల వరకు అక్రమ ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఉదయం నుంచి జీపీ కుమార్ ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. రాత్రి కూడా తనిఖీలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీపీ కుమార్ లాకర్లు తెరిచిన అధికారులు .. భారీగా నగలు, నగదు , ఆస్తిపత్రాలను గుర్తించారు.
ఇకపోతే.. Kurnool మున్సిపల్ కార్పోరేషన్ లో గురువారం నాడు ACB అధికారులు Raids చేశారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఈ Surendra ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అమృత్ స్కీం రూ. 1.52 కోట్ల బిల్లు మంజూరు చేసేందుకు ఎస్ఈ సురేంద్ర లంచం డిమాండ్ చేసినట్టుగా కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు.ఈ విషయమై ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన కాంట్రాక్టర్ బండారం బట్టబయలు చేశాడు. కాంట్రాక్టర్ నుండి రూ. 15 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా
ఆయనను పట్టుకున్నారు.