తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో ట్విస్ట్: బిల్డర్ వద్ద రూ. 4 కోట్లు సీజ్

By narsimha lodeFirst Published Sep 1, 2020, 4:49 PM IST
Highlights

తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది.  నివాస స్థలం కోసం  రూ. 4 కోట్లను మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, డాక్టర్ నాగమణిలకు చెందిన బిల్డర్ రూ. 4 కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. 


హైదరాబాద్: తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది.  నివాస స్థలం కోసం  రూ. 4 కోట్లను మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, డాక్టర్ నాగమణిలకు చెందిన బిల్డర్ రూ. 4 కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. బిల్డర్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.తెలంగాణ ఈఎస్ఐ స్కాంలో మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు డాక్టర్ నాగమణిలతో పాటు మరికొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి, డాక్టర్ నాగమణిలు నివాస స్థలం కోసం రూ. 4 కోట్లను ఇచ్చినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అక్రమాస్తులు బిల్డర్ వద్దే ఉన్నాయని ఏసీబీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఈ నాలుగు కోట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.  బిల్డర్ ను అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. 

ఏపీ రాష్ట్రంలో కూడ ఈఎస్ఐ స్కాం చోటు చేసుకొంది.ఈ స్కాంలో అచ్చెన్నాయుడు సహా పలువురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణ తరహలోనే ఏపీలో ఈఎస్ఐ స్కాం చోటు చేసుకొన్నట్టుగా చెబుతున్నారు. 

 

 

click me!