స్టీఫెన్‌సన్ కూతురు సాక్ష్యం వద్దు: ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు

By narsimha lodeFirst Published May 7, 2021, 3:16 PM IST
Highlights

ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్ కూతురు సాక్ష్యం అవసరం లేదని ఏసీబీ కోర్టు తెలిపింది. 
 

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్ కూతురు సాక్ష్యం అవసరం లేదని ఏసీబీ కోర్టు తెలిపింది. ఓటుకు నోటు కేసుపై శుక్రవారం నాడు ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.స్టీఫెన్ సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని కోర్టుకు  ఏసీబీ తెలిపింది. అమెరికాలో ఉన్న స్టీఫెన్ సన్ కుమార్తె కరోనా వేళ రాలేరని ఏసీబీ కోర్టుకు తెలిపింది.

also read:ఓటుకు నోటు కేసు.. ఆ గొంతు చంద్రబాబుదే..!

దీంతో స్టీఫెన్ సన్ కుమార్తెను సాక్షిగా తొలగించేందుకు ఏసీబీ కోర్టు అంగీకారం తెలిపింది. స్టీఫెన్ సన్, మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విచారణను ఈనెల 10కి వాయిదా వేశారు. 2015 లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  నామినేటేడ్ ఎమ్మెల్సీ  స్టీఫెన్‌సన్  కు  రూ. 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికాడు.

అయితే  ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో తనను ఇరికించారని  రేవంత్ రెడ్డి అప్పట్లో ఆరోపించారు.  ఈ ఘటన అప్పట్లో రాజకీయాల్లో పెద్ద సంచలనమే. ఈ ఘటన జరిగిన సమయంలో ఏపీ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు.ఈ ఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. 
 

click me!