మల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట ఎన్‌ఎస్‌యూఐ ధర్నా: అద్దాలు ధ్వంసం

By narsimha lodeFirst Published May 7, 2021, 2:13 PM IST
Highlights

 మల్లారెడ్డి ఆసుపత్రి ముందు శుక్రవారం నాడు ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. 

హైదరాబాద్:  మల్లారెడ్డి ఆసుపత్రి ముందు శుక్రవారం నాడు ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. సూరారం చెరువు భూములను కబ్జా చేసి ఆసుపత్రిని కట్టారని ఎన్ఎష్‌యూఐ కార్యకర్తలు ఆరోపించారు. ఈ ఆసుపత్రిని కరోనా రోగులకు ఉచితంగా వైద్యం చేసేందుకు అందించాలని కోరారు. 

ఆసుపత్రి  ముందు ఆందోళన చేస్తున్న  పలువురిని  పోలీసులు అరెస్ట్ చేశారు. పీపీఈ కిట్స్ వేసుకొని ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో  టీఆర్ఎస్ నేతలు భూములు ఆక్రమించుకొన్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే.దేవరయంజాల్ కి చెందిన శ్రీసీతారామస్వామి ఆలయానికి చెందిన భూములను మంత్రి మల్లారెడ్డి ఆక్రమించుకొన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అంతేకాదు ఫామ్ హౌస్ ను నిర్మించుకొన్నారని రేవంత్ రెడ్డి విమర్శించిన విషయం తెలిసిందే. 

దేవరయంజాల్ శ్రీసీతారామస్వామి ఆలయ భూములను కాంగ్రెస్ నేతలు గురువారం నాడు పరిశీలించారు. ఈ భూములను ఆక్రమించుకొన్నవారిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఁభూములతో పాటు హకీంపేట, మాసియపేట గ్రామాల్లో భూములను ఆక్రమించుకొన్నారనే ఆరోపణలతో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ తప్పించారు. 

 

click me!