రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు మేయర్లు, చైర్మెన్లు వీరే...

By narsimha lodeFirst Published May 7, 2021, 10:47 AM IST
Highlights

రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు మేయర్లు, చైర్మెన్ల పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది.  ఎన్నికల పరిశీలకులకు సీల్డ్ కవర్లో ఈ పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పంపింది. 

హైదరాబాద్: రెండు కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు మేయర్లు, చైర్మెన్ల పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసింది.  ఎన్నికల పరిశీలకులకు సీల్డ్ కవర్లో ఈ పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పంపింది. 

వరంగల్ కార్పోరేషన్ మేయర్ పదవిని గుంగు సుధారాణి, ఖమ్మం మేయర్ పదవిని నీరజకు కట్టబెట్టాలని టీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంది. సిద్దిపేట మున్సిపాలిటీకి మంజుల, జడ్చర్లకు దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్ లో రాచకొండ శ్రీను, అచ్చంపేటలో నర్సింహ్మ గౌడ్ లేదా శైలజ పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం ఖరారు చేసినట్టుగా సమాచారం.  

మున్సిపల్ చైర్మెన్లు, కార్పోరేషన్ మేయర్ పదవులకు ఇప్పటికే మంత్రులు, పార్టీ నేతలను కేసీఆర్ ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. వరంగల్ కు మంత్రులు గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, ఖమ్మంకి మంత్రి ప్రశాంత్ రెడ్డి, నూకల సురేష్ రెడ్డి,సిద్దిపేటకు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, ఒంటేరు ప్రతాప్ రెడ్డి, అచ్చంపేటకు మంత్రి నిరంజన్ రెడ్డి,మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలను పార్టీ నాయకత్వం ఎన్నికల పరిశీలకులుగా నియమించిన విషయం తెలిసిందే. 

click me!