రూ. 40 లక్షల లంచం: మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్ కు రంగం సిద్దం

Published : Sep 09, 2020, 05:58 PM ISTUpdated : Sep 09, 2020, 06:05 PM IST
రూ. 40 లక్షల లంచం:  మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ అరెస్ట్ కు రంగం సిద్దం

సారాంశం

మెదక్ జిల్లా అదనపు అడిషనల్ కలెక్టర్ నగేష్ ను బుధవారం నాడు ఏసీబీ అధికారులు అరెస్ట్  చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్దం చేశారు.


మెదక్: మెదక్ జిల్లా అదనపు అడిషనల్ కలెక్టర్ నగేష్ ను బుధవారం నాడు ఏసీబీ అధికారులు అరెస్ట్  చేసేందుకు రంగం సిద్దం చేశారు. 

ఓ భూమికి ఎన్ఓసీ ఇచ్చేందుకు రూ. 1.12కోట్లకు నగేష్ డీల్ కుదుర్చుకొన్నాడు.అంతేకాదు ఈ డీల్ లో భాగంగా రూ. 40 లక్షలు లంచం తీసుకొంటున్న సమయంలో ఏసీబీ అధికారులు నగేష్ ను ఇవాళ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్నారు.

తన పేరుతో రూ. 72 లక్షల విలువైన భూములను నగేష్ రిజిష్ట్రేషన్ చేయించుకొన్నాడని ఏసీబీ అధికారులు గుర్తించారు.ఇవాళ ఉదయం నుండి నగేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

also read:నాగరాజునే తలదన్నిన నగేష్: కోటీ 12 లక్షల లంచం తీసుకుంటూ....

నగేష్ ఆడియో క్లిఫ్పులను కూడ ఏసీబీ అధికారులు సేకరించారు. నగేష్ తో పాటు ఆర్డీఓ, తహశీల్దార్ అబ్దుల్ సత్తార్ ఇంట్లో కూడ ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం నుండి సోదాలు నిర్వహించారు. నర్సాపూర్ డివిజిన్ లోని చిప్పలకుర్తి గ్రామంలో వివాదంలో ఉన్న 113 ఎకరాల భూమికి ఎన్వోసీ ఇచ్చేందుకు రూ.1.12 కోట్లు డీల్ కుదుర్చుకొన్నాడు. లంచం కోసం కోటి రూపాయాల విలువైన ఆస్తిపత్రాలపై ఒప్పందం రాయించుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిస్తున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !