శాశ్వత కుల, ఆదాయ సర్టిఫికెట్ల జారీ: తెలంగాణ సర్కార్ కసరత్తు

By narsimha lodeFirst Published Sep 9, 2020, 4:48 PM IST
Highlights

ఇక నుండి పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సర్టిఫికెట్లను జారీ చేయడానికి గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు అధికారాలను అప్పగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
 


హైదరాబాద్:ఇక నుండి పర్మినెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ సర్టిఫికెట్లను జారీ చేయడానికి గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలకు అధికారాలను అప్పగిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.సమగ్ర సర్వే ద్వారా సేకరించిన డేటాబేస్ ఆధారంగా ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడ అందిస్తామని ఆయన తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూముల సమచారం ఇక నుండి ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా భూముల వివరాలను ఎవరైనా ఎక్కడినుండైనా తెలుసుకొనే వెసులుబాటు లభించనుందని  సీఎం ప్రకటించారు. 

also read:కేసీఆర్ గుడ్ న్యూస్: అధిక ఫీజులు వసూలు చేస్తే కార్పోరేట్ ఆసుపత్రులపై చర్యలు

ఈ మేరకు ధరణి వెబ్ సైట్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ధరణి వెబ్ సైట్ లో ప్రతి భూమి వివరాలు కూడ ఉంటాయన్నారు. ఈ వెబ్ సైట్ లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల వివరాలు ఉంటాయని ఆయన చెప్పారు.

బుధవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవిన్యూ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. కొత్త రెవిన్యూ ముసాయిదా బిల్లుపై  రెండు రోజులు సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత చర్చిద్దామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

click me!