చావ‌క‌ముందే చ‌చ్చిండ‌ని పెన్ష‌న్‌ ఆపేశారు

First Published Jun 12, 2017, 2:55 PM IST
Highlights

తెలంగాణలో ప్ర‌భుత్వ అధికారుల లీల‌లు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.బాధ్య‌త‌గా ఉండాల్సిన అదికార యంత్రాగం బాధ్య‌త మ‌ర‌చి నిద్ర‌పోతున్న తీరు ఇది. ఓ పండుటాకు బ‌తికుండ‌గానే... చనిపోయిన‌ట్లు కాగితాల మీద ఖ‌రారు చేసి ఆయ‌న‌కు రావాల్సిన ఆస‌రా పెన్స‌న్ సొమ్మును ఆపేసిన సంఘ‌న ఇది. 

తెలంగాణలో ప్ర‌భుత్వ అధికారుల  లీల‌లు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. బాధ్య‌త‌గా ఉండాల్సిన అదికార యంత్రాగం బాధ్య‌త మ‌ర‌చి నిద్ర‌పోతున్న తీరు ఇది. ఓ పండుటాకు బ‌తికుండ‌గానే... చనిపోయిన‌ట్లు కాగితాల మీద ఖ‌రారు చేసి ఆయ‌న‌కు రావాల్సిన ఆస‌రా పెన్స‌న్ సొమ్మును ఆపేసిన దుర్మార్గ సంఘ‌న ఇది. 

ఆయ‌న 68 ఏళ్ల వృద్ధుడు. ఆయ‌న‌కు 2014 న‌వంబ‌రు నుంచి స‌ర్కారు వృధ్యాప్య పెన్ష‌న్ అందిస్తున్న‌ది. అక‌స్మాత్తుగా ఆయ‌న పెన్ష‌న్ ఆపేశారు అధికారులు. దీంతో ఆ వృద్ధుడు ఆందోళ‌న చెందాడు. త‌న‌కు పెన్ష‌న్ ఎందుకు రావ‌డంలేద‌ని అంద‌రినీ ఆరా తీశాడు. తీరా అధికారులు ఏమ‌ని తేల్చారంటే... ఆ వృద్ధుడు చ‌నిపోయాడ‌ని, అందుకే పెన్ష‌న్ ఆపిన‌ట్లు చెప్పారు. దీంతో ల‌బోదిబోమంటూ ఆ బాధితుడు న్యాయ పోరాటం చేస్తున్నాడు.  


వ‌రంగ‌ల్ అర్బ‌న్ జిల్లా లోని క‌మ‌లాపూర్ మండ‌లంలోని క‌న్నూరు గ్రామానికి చెందిన కేంసార‌పు సార‌య్య కు 2014 న‌వంబ‌రు నుంచి ఆస‌రా పెన్ష‌న్ అందుతోంది. 2015 జూన్ వ‌ర‌కు వెయ్యి రూపాయ‌ల ఆస‌రా పెన్ష‌న్ అందింది. జులైలో పెన్స‌న్ బంద్ అయింది. ఎందుకు బంద్ అయిందో ఆయ‌న‌కు ముందుగా అర్థం కాలేదు. అధికారుల చుట్టూ తిరిగిన త‌ర్వాత అస‌లు విష‌యం బోధ‌ప‌డ్డ‌ది.

సార‌య్య మృతి చెందిన‌ట్లు రికార్డుల్లో న‌మోదు చేశారు అధికారులు. దీంతో ఆయ‌న‌కు గ‌త రెండేళ్లుగా పెన్స‌న్ అందుత‌లేదు. ఆయ‌న త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై న్యాయ‌పోరాటం కొన‌సాగిస్తున్నాడు.

click me!