పెళ్లికి షరతులు పెడుతున్న తెలంగాణ సర్కారు

First Published Apr 23, 2017, 12:07 PM IST
Highlights

ఆధార్ తప్పనిిసరి చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఇక తెలంగాణలో పెళ్లి చేసుకోవాలంటే సర్కారు నిబంధనలు పాటించాల్సిందే. ఆన్ లైన్ లో వధూవరులు తమ వేలిముద్రలను ఇవ్వాల్సిందే. అంతేకాదు ఆధార్ కార్డు కూడా కచ్చితంగా సమర్పించాల్సిందే.

 

ఎందుకంటే ఇక తెలంగాణలో పెళ్లిలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఆధార్ కార్డు, వేలిముద్రలను తప్పనిసరి చేసింది.దీని వల్ల ప్రజలకు కూడా బాగానే ఉపయోగం ఉంటుంది. రెండు మూడు పెళ్లిలు చేసుకొనే ప్రబుద్ధులు ఇక ఈ జీగా ప్రభుత్వానికి దొరికిపోతారు.

 

రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రస్తుతం పెళ్లిళ్లలను రికార్డ్‌ చేస్తున్నారు. వీటిలో రెండు రకాల వివాహ సేవలను ఉన్నాయి. అయితే ఇదంతా ఆన్ లైన్ కిందలేదు. ఇప్పుడు దీన్ని ఆన్ లైన్ చేయనున్నారు.

 

పెళ్లిచేసుకోవాలనుకునే వారు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ ‘registrat-ion.telangana.gov.in’ కి లాగిన్ అయి పూర్తి వివరాలను వధూవరులు నమోదు చేయాలి. ఆధార్ కార్డు, వేలిముద్రలు తదితరలన్నీ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి. అప్పుడు పెళ్లికి ప్రభుత్వం అంగీకారం తెలుపుతుంది.

click me!