వాషింగ్టన్ పోస్టులో ప్రణయ్, అమృతల కథనం

By narsimha lodeFirst Published Aug 20, 2019, 3:38 PM IST
Highlights

అమృత, ప్రణయ్ కథనాన్ని వాషింగ్టన్ పోస్టు ప్రచురించింది. దేశంలో ఈ తరహ ఘటనలను కూడ ఆ కథనంలో ప్రస్తావించింది.

మిర్యాలగూడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు విషయాన్ని వాషింగ్టన్ పోస్టులో కథనం ప్రచురిందింది.2018 సెప్టెంబర్ 14వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో జ్యోతి ఆసుపత్రి ఆవరణలో ప్రణయ్‌ను కిరాయి హంతకుడు దారుణంగా హత్యచేశాడు.

హత్యకు గురికావడానికి ఆరు మాసాల ముందే ప్రణయ్, అమృతలు ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకొన్నారు.చాలా కాలంగా మిర్యాలగూడకు దూరంగా వారు ఉన్నారు.హత్యకు గురి కావడానికి  రెండు మాసాల ముందే ఆ దంపతులు మిర్యాలగూడకు వచ్చారు. 

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 23 ఏళ్ల ప్రణయ్, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన 21 ఏళ్ల అమృతను పెళ్లి చేసుకొన్నాడు. అమృత తండ్రి మారుతీరావుకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో కిరాయి హంతకులను పెట్టి ప్రణయ్ ను హత్య చేయించినట్టుగా కోర్టు ఆధారాలను బట్టి తెలుస్తున్నట్టుగా ఆ కథనం తెలిపింది.

.ఈ కేసులో అరెస్టై ఇటీవలనే మారుతీరావు ఆయన సోదరుడు బెయిల్ పై విడుదలయ్యారు.

భారతీయ సమాజం మార్పు చెందుతుంది. అయితే అమృత, ప్రణయ్ దంపతులు మారినంత వేగంగా భారత సమాజం మారడం లేదని ఆ కథనం చెబుతుంది.దేశంలో పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోంది.

దేశంలోని ఒకే కులానికి చెందిన యువతీ యువకుల మధ్య వివాహలు జరుగుతుంటాయి. అయితే వేర్వేరు కులాలకు చెందిన యువతీ  యువకుల మధ్య పెళ్లిళ్లు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. అయితే 2017 లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారంగా దేశంలో 5.8 శాతం మాత్రమే వేర్వేరు కులాల మధ్య పెళ్లిళ్లు జరిగినట్టుగా తేలింది.

కులాంతర వివాహలు కొన్ని సమయాల్లో తీవ్రమైన హింసకు కూడ దారి తీసిన సందర్భాలు కూడ లేకపోలేదు.  కులాంతర వివాహలు చేసుకొన్నందుకు హత్యలకు కూడ గురైన సందర్భాలు ఉన్నట్టుగా ఆ కథనం తెలిపింది. దేశంలోని గుజరాత్, తమిళనాడు, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ రకమైన ఘటనలు చోటు చేసుకొన్న విషయాన్ని ఆ కథనంలో ప్రస్తావించారు.

బీజేపీ ఎంపీ కూతురు కులాంతర వివాహం చేసుకొన్నందుకు గాను తనకు రక్షణ కల్పించాలని కోరిన విషయాన్ని కూడ ఆ కథనంలో ప్రస్తావించారు. 

సంప్రదాయాన్ని గౌరవించే పేరుతో కొన్ని సమయాల్లో హింసకు పాల్పడుతున్నారని చరిత్రకారుడు  ఉమా చక్రవర్తి చెప్పారు. ఎవరిని పెళ్లి చేసుకోవాలనే విషయమై  ఓ మహిళకు హక్కు ఉంటుందన్నారు.

భారత్ లో 1.3 బిలియన్ ప్రజలు ఉంటే వారిలో 13  శాతం ప్రజలు దళితులున్నారు. దశాబ్దాల అణచివేత ద్వారా విద్య, రాజకీయాలు తదితర రంగాల్లో దళితులు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నట్టుగా ఆ కథనం తెలిపింది. 

ప్రణయ్ ను వివాహం చేసుకొన్న అమృతకు తాను 9వ తరగతి చదువుకొనే సమయంలోనే తన మనసు నుండి కులాన్ని తీసేసింది. స్కూల్ లో తన కంటే సీనియర్ అయిన ప్రణయ్ ను ఆమె చిన్నప్పుడే ఇష్టపడింది. 

అయితే చిన్న కులానికి చెందిన వారికి దూరంగా ఉండాలని అమృతకు తండ్రి అమృత  మారుతీరావు చెప్పేవారు.  అయితే  చిన్న కులానికి చెందిన వారిని పెళ్లి చేసురకోకూడదని తండ్రి తనకు చెప్పినట్టుగా అమృత మీడియాకు వివరించారు. 

2018 జనవరి 30వ తేదీన అమృత తన సర్టిఫికెట్లను తీసుకొని ప్రణయ్ తో వెళ్లిపోయింది. హైద్రాబాద్ లో కొద్ది మంది స్నేహితుల సమక్షంలో ప్రణయ్ అమృతల పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత ఈ దంపతులు విదేశాలకు వెళ్లాలనుకొన్నారు.

కానీ అప్పటికే అమృతి గర్భవతి అయింది. దీంతో  ఈ విషయాన్ని ప్రణయ్ తల్లిదండ్రులకు చెప్పారు. 2018 ఆగష్టు 17వ తేదీన మిర్యాలగూడలో రెసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ కు మారుతీరావు దంపతులు హాజరుకాలేదు. అంతకుముందు మాసంలోనే మారుతీరావు తన అల్లుడు ప్రణయ్ ను చంపేందుకు కిరాయి హంతకులకు డబ్బులు చెల్లించారు.

కిరాయి హంతకుడు గత ఏడాది సెప్టెంబర్ 14వ తేదీన జ్యోతి ఆసుపత్రి ఆవరణలో హత్య చేశారు.ఈ హత్యపై పలు దళిత సంఘాలు ప్రణయ్ కుటుంబానికి అండగా నిలిచాయి.

ఈ విషయమై మాట్లాడేందుకు మారుతీరావు నిరాకరించినట్టుగా వాషింగ్టన్ పోస్టు కథనం ప్రచురించింది.అయితే ఈ హత్యకు మారుతీరావుకు సంబంధం ఉన్నట్టుగా 56 పేజీల చార్జీషీటులో మారుతీరావు పేరుంది.


సంబంధిత వార్తలు

ప్రణయ్‌ని చంపిన కిల్లర్‌ నుంచి మారుతీరావుకు బెదిరింపులు

ప్రణయ్ హత్య కేసులో నిందితుడు.. హరెన్ పాండ్యా హత్య కేసులో దోషి

ప్రణయ్ హత్య కేసు: జైలు నుంచి మారుతీరావు విడుదల

నిలిచిపోయిన ప్రణయ్ హత్యకేసు నిందితుల విడుదల

ప్రాణహాని ఉంది, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం: బెయిల్ మంజూరుపై అమృత

మారుతీరావుకు బెయిల్... అమృత స్పందన ఇదే...

ప్రణయ్ హత్య కేసు: అమృత తండ్రి మారుతీరావుకు బెయిల్

click me!