
తెలంగాణ సిఎం కెసిఆర్ సభలో ఒక సర్పంచ్ హల్ చల్ చేశాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం గంగపూర్ సర్పంచ్ శంకర్ నాయక్ సియం సభ ప్రాంగణం లొనే హోర్డింగ్ ఎక్కి నిరసన తెలిపారు. తమ గ్రామానికి రోడ్డు వంతెన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయన హోర్డింగ్ పై ఉన్న సమయం లొనే బాల్కొండ కు చెందిన విజయ లక్ష్మి అనే మరో యువతీ కూడా నిరసన తెలిపారు. ఎన్నోసార్లు బాల్కొండ ఎం ఎల్ ఏ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని ఆరోపించారు. బాధితుల నిరసనలు కొనసాగుతుండగానే సియం సభను ముగించి వెళ్లిపోయారు. సభ ముగిసిన తర్వాత పోలీస్ లు వారిని సముదాయించి కిందకు దింపారు. సభలో ఈ ఘటన కలకలం రేపింది.