
ఆ యువతి ఓ యువకుడిని ప్రేమించింది. కానీ అతడు అంతకు ముందే వేరే అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నాడు. అయినా వారిద్దరూ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటున్నారు. కొంత కాలం తరువాత తన భర్త రిలేషన్ షిప్ లో ఉన్న అమ్మాయితో ఆ యువతి దగ్గరుండి పెళ్లి చేయించింది. కానీ ఇప్పుడు మళ్లీ భర్త తనకు కావాలని, న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. ఈ వింత ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దారుణం.. కూలి పనుల కోసం వలస వచ్చిన బాలికపై గ్యాంగ్ రేప్.. అస్వస్థతతో మరణించిన బాధితురాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగాడి కుంట బస్తీలో 20 ఏళ్ల యువతి హోం ట్యూటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె 2020లో డ్యాన్స్ నేర్చుకునేందుకు యూసుఫ్ గూడలోని ఓ డ్యాన్స్ అకాడమీలో చేరింది. ఈ క్రమంలో అక్కడ 23 ఏళ్ల గాంధీతో ఆమెకు పరిచయయ్యింది. వారి మధ్య సన్నిహిత్యం పెరిగింది. కొంత కాలం తరువాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని భావించారు. ఈ విషయం ఇరు కుటుంబాల పెద్దలకు తెలిపారు. వారు దీనికి అంగీకరించారు. నిశ్చితార్థం జరిపించారు. అయితే అప్పటి నుంచి వారిద్దరూ సహజీనం చేయడం మొదలుపెట్టారు.
తాజా సర్వే: ఏపీలో జగన్ హవా, చంద్రబాబు గాలి నామమాత్రమే
ఇదే క్రమంలో గాంధీకి రోజా అనే యువతితో పరిచయం అయ్యింది. ఈ విషయం ఆ యువతి తెలిసింది. దీంతో ఆమె అనుమానం వ్యక్తం చేయడంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దీంతో రోజా, గాంధీలు కలుగజేసుకొని, తామిద్దరం కేవలం స్నేహితులమని తేల్చి చెప్పారు. దీనిని ఇరు కుటుంబాల పెద్దలు నమ్మారు. మే 14వ తేదీన రోజా.. గాంధీకి ఆ యువతితో దగ్గరుండి పెళ్లి జరిపించింది.
వివాహమైన మొదట్లో కొత్త దంపతులు బాగానే ఉన్నారు. కొంత కాలం తరువాత గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు. ఇదేంటని ఆ యువతి ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆ యువతి ఓ షాకింగ్ విషయం తెలుసుకుంది. గాంధీతో తన వివాహం జరగడానికి కొన్ని రోజుల ముందు.. రోజాతో కూడా పెళ్లయ్యిందని తెలుసుకుంది. అయితే ఆ యువతి బంజారాహిల్స్‌లోని రోడ్ నంబరు 12లో మంగళవారం ఉంది. ఆ సమయంలో రోజా తన మద్దతుదారులతో కలిసి అక్కడి వచ్చింది. తనకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టింది. ఈ పరిణామాలతో విసిగెత్తిపోయిన ఆ యువతి అదే రోజు రాత్రి పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.