ఒక రష్యన్.. ప్రేమ కథా ‘చిత్రం’

Published : Nov 30, 2016, 01:42 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఒక రష్యన్.. ప్రేమ కథా ‘చిత్రం’

సారాంశం

భార్య కోసం భారత్ కు వచ్చిన అలెక్స్ డబ్బు ఇస్తేనే వెంట వస్తానంటున్న హైదరాబాదీ యువతి బేగంపేట్ పోలీస్ స్టేషన్ ఎదుట భర్త మౌనపోరాటం

 

బంధాలకు.. అనుబంధాలకు విలువనిచ్చే భారత్ అమ్మాయి ఆమె.. డేటింగ్ లు, డివోర్స్ లు మాత్రమే తెలిసిన రష్యని అతడు.ఇద్దరు అనుకోకుండా గోవాలో కలిశారు. ప్రేమ పాఠాలు పాడారు.

 

కులం, మతం, జాతి అడ్డుకాదని పెళ్లి పీటలెక్కారు.. ఏడడుగులు వేశారు. ముచ్చటగా కాపురం చేసి పండంటి బిడ్డను కన్నారు. ఇదంతా రోటీన్ ప్రేమ కథే.. ఇక్కడే ఒక చిత్రం మొదలైంది.

 

భర్త తో ఏడడుగులు వేసి, సప్త సముద్రాలు దాటి భర్త ఇంటికి వెళ్లిన ఆ అమ్మాయి అతడికి చెప్పపెట్టకుండా పుట్టింటికి వచ్చేసింది.

 

 

పాపం.. ఆ భార్యకు వెతుక్కుంటూ ఆ విదేశీయుడు ఇక్కడికి వచ్చేశాడు. ఇప్పుడు తన వెంట రావాలంటే కావాల్సినంత డబ్బు ఇవ్వాలంటూ ఆమె షరతులు పెడుతుంది.దీంతో ఆ రష్యన యువకుడు చివరకు మౌనపోరాటానికి దిగాడు.

 

సంప్రదాయాలకు, విలువలకు అమ్మమ్మలాంటి భారత్ లో పుట్టిన యువతి ఆమె..  ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో ఏడడుగులు వేసింది. ఇప్పుడు ఒక్క మాటా కూడా అతడితో చెప్పకుండా పుట్టింటికి వచ్చేసింది. ఇప్పుడు డబ్బులిస్తేనే నీ వెంట వస్తానంటుంది..

 

 

రష్యాకు చెందిన అలెక్స్ ఎర్మకోవ్ 2012లో గోవాకు వచ్చాడు.  అక్కడ హైదరాబాద్కు చెందిన  సనం ఉల్‌హక్ తో ప్రేమలో పడ్డాడు.  బేగంపేట రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి కూడా చేసుకున్నారు. తర్వాత రష్యాకు వెళ్లిపోయారు. ఇటీవల సనం మొగుడికి మాట మాత్రం చెప్పకుండా  కొడుకుతోపాటు భారత్ కు వచ్చేసింది.

 

విషయం తెలుసుకున్న అలెక్స్ భార్య కోసం హైదరాబాద్ వచ్చాడు. కానీ, డబ్బులు ఇస్తేనే కొడుకుతోపాటు రష్యా వస్తానంటూ సనం తెగేసి చెప్పింది. దీంతో అలెక్స్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు మౌన పోరాటానికి దిగాడు.

 

ఈ కామ్రెడ్ ప్రేమ పోరాటం ఫలించి ఆ యువతి భర్త వెంట వెళ్తుందో లేదో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం