హైదరాబాద్ మొఘల్ పురాలో కాల్పులు: ఎనిమిదేళ్ల బాలుడికి గాయాలు

Published : Aug 05, 2022, 12:43 PM ISTUpdated : Aug 05, 2022, 12:47 PM IST
హైదరాబాద్ మొఘల్ పురాలో కాల్పులు:  ఎనిమిదేళ్ల బాలుడికి గాయాలు

సారాంశం

హైద్రాబాద్ మొఘల్ పురాలో కుక్కులను  తరిమేందుకు ఎయిర్ గన్ తో జరిపిన కాల్పుల్లో ఎనిమిదేళ్ల బాలుడికి గాయాలయ్యాయి.  గాయపడిన ఎనిమిదేళ్ల అజాన్ అనే బాలుడిని  కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. 

హైదరాబాద్: Hyderabad నగరంలోని మొఘల్ పురాలో కాల్పుల ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనలో  ఎనిమిదేళ్ల  అజాన్ అనే బాలుడు గాయపడ్డారు. గాయపడిన అజాన్ అనే బాలుడిని ఆసుపత్రికి తరలించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. కుక్కలను తరిమేందుకు గాను అఫ్సర్ అనే వ్యక్తి ఎయిర్ గన్  తో కాల్పులకు దిగాడు. అయితే  ఎయిర్ గన్ తో కాల్పులు జరిపిన సమయంలో అజాన్ అనే బాలుడికి ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి.ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడికి చికిత్స అందిస్తున్నారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారని ఆ కథనం తెలిపింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు