ముగిసిన కోకాపేట భూముల వేలం.. ఎకరం రూ. 50 కోట్లు పైమాటే, ప్రభుత్వానికి భారీగా ఆదాయం

By Siva Kodati  |  First Published Jul 15, 2021, 5:31 PM IST

కోర్టు తీర్పు, హైడ్రామా మధ్య ఎట్టకేలకు కోకాపేట భూముల వేలం ముగిసింది. హెచ్ఎండీఏకు చెందిన 49 ఎకరాల్లో 8 ఫ్లాట్లను వేలం వేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నాలుగు ఫ్లాట్లు, ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో నాలుగు ఫ్లాట్ల వేలం జరిగింది.


రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్ని కోకాపేట భూముల వేలం ముగిసింది. ఈ- ఆక్షన్‌లో దాదాపు 60 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. హెచ్ఎండీఏ కోకాపేట భూములకు ఎకరాకు రూ.25 కోట్ల అప్సెట్ ధరను ఫిక్స్ చేసింది. మరోవైపు ఎకరాకు రూ.50 కోట్ల ధర వస్తుందని హెచ్ఎండీఏ అంచనా వేస్తోంది. హెచ్ఎండీఏకు చెందిన 49 ఎకరాల్లో 8 ఫ్లాట్లను వేలం వేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నాలుగు ఫ్లాట్లు, ఆ తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు మరో నాలుగు ఫ్లాట్ల వేలం జరిగింది. ఫ్లాట్లను ఎవరు సొంతం చేసుకున్నారనే దానిపై ప్రభుత్వం సాయంత్రానికి అధికారిక ప్రకటన చేయనుంది. రేపు ఖానామెట్‌లో వున్న 15 ఎకరాల భూమిని వేలం వేయనున్నారు. మొత్తం మీద భూముల వేలం ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకుంటుందని అంచనా. 

Also Read:ప్రభుత్వ భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదు: కోర్టు తీర్పుపై విజయశాంతి స్పందన

Latest Videos

అంతకుముందు నిన్న తెలంగాణ బీజేపీ నేత విజయశాంతికి హైకోర్టులో చుక్కెదురైంది. కోకాపేట, ఖానామెట్ భూముల వేలాన్ని నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కోకాపేటలో 44.94 ఎకరాలు, ఖానామెట్‌లో 14.92 ఎకరాల భూములను వేలం వేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే భూముల వేలాన్ని నిలుపుదల చేయాలంటూ విజయశాంతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భూముల విక్రయానికి సంబంధించిన జీవో నెం 13ను కొట్టివేయాలని విజయశాంతి పిటిషన్‌లో కోరారు.

click me!