తెలంగాణ: కొత్తగా 772 కరోనా కేసులు.. హైదరాబాద్, ఖమ్మంలలో తీవ్రత

Siva Kodati |  
Published : Jul 07, 2021, 09:44 PM IST
తెలంగాణ: కొత్తగా 772 కరోనా కేసులు.. హైదరాబాద్, ఖమ్మంలలో తీవ్రత

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 88 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో 86 కేసులతో ఖమ్మం జిల్లా ఉంది

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా అదుపులోకి వస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 88 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో 86 కేసులతో ఖమ్మం జిల్లా ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదు కావడం విశేషం. ఇదే సమయంలో కరోనా బారిన పడి రాష్ట్రంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 6,29,054కి చేరుకుంది. అలాగే 6,13,872 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,710 మంది కరోనాతో మృతి చెందారు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 3, భద్రాద్రి కొత్తగూడెం 28, జీహెచ్ఎంసీ 88, జగిత్యాల 18, జనగామ 6, జయశంకర్ భూపాలపల్లి 16, గద్వాల 1, కామారెడ్డి 2, కరీంనగర్ 48, ఖమ్మం 86, ఆసిఫాబాద్ 4, మహబూబ్‌నగర్ 8, మహబూబాబాద్ 33, మంచిర్యాల 47, మెదక్ 4, మేడ్చల్ మల్కాజిగిరి 35, ములుగు 18, నాగర్ కర్నూల్ 8, నల్గగొండ 57, నారాయణపేట 4, నిర్మల్ 4, నిజామాబాద్ 8, పెద్దపల్లి 41, సిరిసిల్ల 16, రంగారెడ్డి 35, సిద్దిపేట 21, సంగారెడ్డి 10, సూర్యాపేట 37, వికారాబాద్ 3, వనపర్తి 9, వరంగల్ రూరల్ 6, వరంగల్ అర్బన్ 51, యాదాద్రి భువనగిరిలో 17 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


 

PREV
click me!

Recommended Stories

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana
School Holidays : ఈ వారంలో ఇంకో నాల్రోజులే స్కూళ్లు నడిచేది.. తర్వాత వరుసగా మూడ్రోజులు సెలవులే