కేసులు తగ్గుముఖం, ఇవాళ కొత్తగా 7 కేసులే: 1016కి చేరిన బాధితుల సంఖ్య

By Siva Kodati  |  First Published Apr 29, 2020, 9:14 PM IST

తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా ఒకటి, అరా కేసులే నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 


తెలంగాణలో కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా ఒకటి, అరా కేసులే నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1016కు చేరింది.

కరోనాతో ఇప్పటి వరకు 25 మరణించగా... 35 మంది కోలుకున్నారు. వీరితో కలిపి 406 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 585 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి శాతం పెరుగుతుండటంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. 

Latest Videos

undefined

Also Read:కరోనా ఎఫెక్ట్: షెల్టర్ హోమ్స్‌లో సౌకర్యాలపై నివేదిక కోరిన తెలంగాణహైకోర్టు

మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ ను మే 3వ తేదీ వరకు విధించింది. లాక్‌డౌన్  నేపథ్యంలో వలస కూలీలు, యాచకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

యాచకులు, వలసకూలీలను షెల్టర్ హోమ్ లకు తరలించాలని అడ్వకేట్ ఎస్. నందా రాసిన లేఖను హైకోర్టు పిటిషన్ గా స్వీకరించింది. ఈ మేరకు ఈ పిటిషన్ పై బుధవారం నాడు విచారణ చేసింది. 

Also Read:కోర్టులకు వేసవి సెలవులు రద్దు: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

యాచకులు, వలస కూలీలను వెంటనే షెల్టర్ హోమ్ లకు తరలించాలని పిటిషనర్ తన లేఖలో కోరారు. షెల్టర్ హోమ్ లపై  మే 7వ తేదీలోపుగా నివేదిక ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.

రాష్ట్రంలో ఎన్ని షెల్టర్ హోమ్స్ ఉన్నాయి, వాటిలో ఎంత మంది ఉన్నారు, వసతుల్లోని సదుపాయాల గురించి చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

click me!