Coronavirus: దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న వైద్యుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ముఖ్యంగా ఎక్కువ మందికి సేవలు అందిస్తున్న పెద్ద ఆస్పత్రుల్లో కరోనా బారినపడుతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది.. సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో సహా 69 మంది ఆసుపత్రి సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరింత మంది ఫలితాలు రావాల్సి ఉంది.
Coronavirus: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వైరస్ (Coronavirus) కారణంగా పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. భారత్ లోనూ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. నిత్యం లక్షల్లో కొత్త కేసులు (Covid-19) నమోదవుతున్నాయి. అయితే, కరోనా వైరస్ బారినపడుతున్న వారిలో వైద్యులు, ఆరోగ్య కార్యర్తలు సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎక్కువ మందికి సేవలు అందిస్తున్న పెద్ద ఆస్పత్రుల్లో కరోనా (Coronavirus) బారినపడుతున్న వైద్యుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల తెలంగాణ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. ఇప్పటికే గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో వందల సంఖ్యలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారినపడ్డారు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా (Coronavirus) కలకలం రేపింది.. సూపరింటెండెంట్ శ్రీనివాసరావుతో సహా 69 మంది ఆసుపత్రి సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరింత మంది ఫలితాలు రావాల్సి ఉంది. కాబట్టి ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా బారినపడ్డ వైద్యులు, ఇతర వైద్య సిబ్బంది సంఖ్య పెరిగే అవకాశం వుంది.
Warangal MGM Hospital ఆస్పత్రిలో 69 మంది వైద్య సిబ్బంది కరోనా మహమ్మారి బారినపడటంతో మిగిలిన ఇతర సిబ్బంది, వైద్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. వీరిలో పలువురి (Coronavirus) రిపోర్టులు రావాల్సి ఉంది. ఆరోగ్య సిబ్బంది కరోనా బారినపడటంతో ఎంజీఎంకు వైద్యం కోసం వచ్చే రోగులలో ఆందోళనలో వ్యక్తమవుతున్నది. పేషెంట్లతో పాటు మిగతా వైద్య సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలావుండగా, అంతకుముందు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కూడా భారీగా కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రిలో విధులు నిర్వర్తించే 120 మంది వైద్య సిబ్బంది కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి బారినపడ్డారు. అలాగే, ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో లోనూ 159మందికి ఆరోగ్య సిబ్బంది కోవిడ్-19 బారినపడ్డారు. అలాగే, ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కూడా 66 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 57 మంది పెషేంట్లు ఉండగా.. 9 మంది వైద్య సిబ్బంది ఉన్నారు.
కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు (Coronavirus) పెరుగుతున్నాయి. సాధారణ వేరియంట్ల తో పాటు ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం తెలంగాణలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీని ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,447 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,11,656 కి చేరింది. గత 24 గంటల్లో కరోనా వైరస్ (Covid-19) తో పోరాడుతూ.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్-19 వల్లమరణించిన వారి సంఖ్య4,060కి చేరింది. ఇదే సమయంలో కొత్తగా 2,295 మంది కోలుకున్నారు. దీంతో కోవిడ్ (Coronavirus) నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,85,399 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,197 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ ఎంసీ పరిధిలో అధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 1112 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కోవిడ్ (Coronavirus) రికవరీ రేటు 96.31 శాతంగా ఉంది.