మునుగోడు బైపోల్ 2022: 12 వేల కొత్త ఓట్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

By narsimha lode  |  First Published Oct 14, 2022, 11:35 AM IST

మునుగోడు  అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  కొత్త ఓటర్ల నమోదులో నకిలీలే ఎక్కువ మంది ఉన్నారని బీజేపీ  హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 


హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ  ఉప ఎన్నికల్లో 12 వేల కొత్త ఓటర్ల నమోదుకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు అనుమతి ఇచ్చింది.  కొత్తఓటర్ల నమోదుకు సంబంధించి ఈ నెల 21 వ తేదీ లోపుగా పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలను పురస్కరించుకొని  రెండు నెలల వ్యవధిలో  25 వేల మంది కొత్తగా ఓటు హక్కు నమోదుకోసం ధరఖాస్తు చేసుకున్నారు.అయితే వీరిలో ఎక్కువ ధరఖాస్తులు బోగస్ అని బీజేపీ ఆరోపించింది. ఇదే అభిప్రాయంతో కాంగ్రెస్  పార్టీ ఉంది.  కొత్తగా నమోదైన  ఓటర్లలో అసలుఓటర్లను తేల్చిన తర్వాతే  ఓటర్ల జాబితా విడుదలకు అనుమతివ్వాలని కోరుతూ బీజేపీ ఈ  నెల 11న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. 

Latest Videos

ఈ పిటిషన్ పై నిన్న తెలంగాణ  హైకోర్టు విచారణ నిర్వహించింది. ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు నమోదైన ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.  25 వేల మంది కొత్తగా ఓటరు నమోదు కోసం  ధరఖాస్తు చేసుకున్నారు. అయితే 12 వేల ధరఖాస్తులకు మాత్రమే అనుమతివ్వాలని కోర్టు ఆదేశించింది.  13 వేల ఓట్లలో 7 వేల ఓట్లను అనుమతించలేదని ఈసీ హైకోర్టుకు తెలిపింది.  మిగిలిన ఆరు వేల ఓట్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని ఈసీ హైకోర్టుకు తెలిపింది.  కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి ఈనెల 21నపూర్తి నివేదికను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఈసీని ఆదేశించింది. 

కొత్త ఓటరు  నమోదు జాబితాను విడుదలచేయకుండా ఆదేశాలు ఇవ్వలేమని నిన్ననే హైకోర్టు స్పష్టం చేసింది.  మునుగోడులో అక్రమ పద్దతిలో విజయం సాధించేందుకు గాను టీఆర్ఎస్ బోగస్ ఓట్లను చేర్పించిందని  బీజేపీ ఆరోపిస్తుంది.ఇదే విషయమై నిన్న ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్  ఈసీఐ కి కూడా ఫిర్యాదు చేశారు. 

also read:మునుగోడు బైపోల్ 2022: కొత్త ఓటరు జాబితాను ప్రకటించొద్దంటూ బీజేపీ హైకోర్టులో పిటిషన్

రెండు మాసాల వ్యవధిలో కొత్త ఓటర్లనమోదుకోసం  25 వేల ధరఖాస్తులు రావడంపై కాంగ్రెస్ పార్టీ కూడా అనుమానం వ్యక్తం చేసింది. ఇటీవల నల్గొండ జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్  అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నిరంజన్  రాష్ట్ర ఎన్నికలప్రధానాధికారి వికాస్ రాజ్ కి లేఖ రాశారు. 

వచ్చేనెల 3 వ తేదీన మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.  కాంగ్రెస్  పార్టీ నుండి దివంగత మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురుపాల్వా యి స్రవంతి బరిలోకి దిగింది. బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నుండి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బరిలో దిగారు.  ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 


 

click me!