హైదరాబాద్‌లో ఓ రెండు నెలల బాలుడికి టీకా వేశారు. ఆ బాలుడు మరుసటి రోజే మరణించాడు. ఇమ్యునైజింగ్ షెడ్యూల్‌లో భాగంగా టీకా వేసినట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 55 రోజుల చిన్నారి బాలుడికి బుధవారం టీకా వేశారు. ఆ మరుసటి రోజే ఆ బాలుడి ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. హాస్పిటల్ తీసుకెళ్లేలోపు మరణించాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన బాలు నాయక్ తండా వాసులు చెందిన లచ్చిరాం, మౌనిక. ఈ దంపతులు సైదాబాద్‌లోని ఖాజా బాగ్‌లో ఓ గుడిసెలో ఉంటున్నారు. ఓ ప్రైవేట్ కాలేజీలో స్వీపర్లుగా పని చేస్తున్నారు. వారికి రెండు నెలల క్రితం పండంటి కొడుకు పుట్టాడు.
undefined
‘ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం టీకా వేయడానికి ఆ దంపతులు వారి కొడుకును బస్తి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. బుధవారం బస్తీ హాస్పిటల్‌లో టీకా వేయించుకున్నారు. గురువారం ఉదయం ఆ బాలుడి ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. తల్లిదండ్రులు ఆ బిడ్డను ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆ బాలుడు మరణించినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు’ అని సైదాబాద్ పోలీసు స్టేషన్ ఎస్ఐ జే నవీన్ తెలిపారు.
తమ బిడ్డ మరణానికి బాధ్యులైన వారిపై యాక్షన్ తీసుకోవాలని పేరెంట్స్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.