ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శిశువు మృతి చెందాడు. 40 రోజుల శిశువు ముక్కు కొరికాయి ఎలుకలు.
నాగర్ కర్నూల్ : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. ఓ 40 రోజుల చిన్నారి మృతి వార్త హృదయవిదారకంగా మారింది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు గ్రామంలో ఓ 40 రోజుల చిన్నారి ముక్కు కొరికిందో ఎలుక. దీంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. అది గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా రక్తస్రావం తీవ్రంగా ఉండండంతో స్థానిక వైద్యులు హైదరాబాద్ లోని నిలోఫర్ కు వెళ్లాలని తెలిపారు.
ఇక్కడ చికిత్స తీసుకుంటున్న చిన్నారి శరీరం చికిత్సకు సహకరించలేదు. దీంతో ఆదివారం రాత్రిమృతి చెందాడు. నాగనూలుకు చెందిన లక్ష్మి, పెద్ద కార్పాములకు చెందిన శివ దంపతులు. వీరికి మూడేళ్ళ క్రితం వివాహం అయ్యింది. నెల క్రితమే ఈ చిన్నారి జన్మించాడు. ప్రసవం కోసం పుట్టింట్లో ఉంది లక్ష్మి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఇంట్లోనే చిన్నారి ముక్కును ఎలుక కొరికింది.
undefined
ఎలుకను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎక్కడా? ఎందుకో తెలుసా?...
బాబు ఏడుస్తుండడంతో గమనించిన తల్లి వెంటనే స్థానిక వైద్యుల దగ్గరికి పరుగు పరుగునా తీసుకువెళ్లింది. కానీ చిన్నారి వయసు రీత్యా చికిత్సకు ఇబ్బంది కావడంతో మృతి చెందాడు. దీంతో ఇరు గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.