హైదరాబాద్‌: పటాన్‌చెరులో రియల్టర్ దారుణహత్య.. చంపి తల, మొండెం వేరు చేసి

By Siva KodatiFirst Published Jan 29, 2022, 7:22 PM IST
Highlights

హైదరాబాద్ పటాన్‌చెరు శివార్లలోని తెల్లాపూర్‌లో రియల్టర్ దారుణహత్యకు గురయ్యాడు. కిడ్నాప్ చేసి హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని కడవత్ రాజుగా గుర్తించాడు. బాధితుడు ఈ నెల 25 నుంచి కనిపించకుండా పోయాడు. 

హైదరాబాద్ పటాన్‌చెరు శివార్లలోని తెల్లాపూర్‌లో రియల్టర్ దారుణహత్యకు గురయ్యాడు. కిడ్నాప్ చేసి హత్య చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని కడవత్ రాజుగా గుర్తించాడు. బాధితుడు ఈ నెల 25 నుంచి కనిపించకుండా పోయాడు. రాజును హత్య చేసి శరీరం నుంచి తల, మొండెం వేరు చేశారు దుండగులు. తం, మొండెంను వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశారు. 

కాగా.. ఈ నెల 10వ తేదీన నాగార్జన సాగర్-హైదరాబాద్ హైవే పక్కనే నల్గొండ జిల్లా విరాట్‌నగర్‌ కాలనీలో మెట్టు మహంకాళీ అమ్మవారి విగ్రహం వద్ద మొండెం లేని మనిషి తల కనిపించడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఇది నరబలి అనే చాలా మంది అనుమానించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. 

హత్యకు గురైన వ్యక్తిని సూర్యాపేట జిల్లా పాకలవీడు మండలం శూన్యపహాడ్ గ్రామానికి చెందిన జయేందర్ నాయక్‌గా గుర్తించారు. అయితే అతనికి మతి స్థిమితం సరిగా లేదని కనుగొన్నారు. మృతుడి మొండెం ఎక్కడుందని తీవ్రంగా గాలింపు చేపట్టిన పోలీసులు.. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లోని (Turkayamjal) ఓ నిర్మానుష్య భవనంలో జయేందర్ నాయక్ మృతదేహాన్ని గుర్తించారు. 

జయేందర్ నాయక్ తల దొరికిన విరాట్ నగర్‌ మహంకాళీ అమ్మవారి ఆలయం, మొండెం లభంచిన తుర్కయాంజ‌లోని భవనం.. రెండు కూడా నాగార్జునసాగర్-హైదరాబాద్‌ హైవే‌ను అనుకుని ఉన్నవే. అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 50 కి.మీ పైగా దూరం ఉంది. నిందితుడిని తొలుత హత్య చేసి అనంతరం విరాట్‌నగర్‌లోని ఆలయం వద్ద తల ఉంచారా..?, లేక విరాట్‌నగర్‌లోనే హత్య చేసి తలను అమ్మవారి ఆలయం వద్ద ఉంచి, అనంతరం మొండెంను తుర్కయాంజల్‌లోని భవనంలో పడేశారా అనేది తెలాల్సి ఉంది. ఈ క్రమంలోనే తుర్కయాంజల్ నుంచి విరాట్‌నగర్‌ మార్గంలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసు మిస్టరీని చేధించేందుకు ప్రత్యేక బృందాలను నియమించారు. 

ఈ కేసులో నిందితులను గుర్తించడానికి రాచకొండ, నల్గొండ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. నరబలి కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని చూస్తున్నారు. అయితే జయేందర్‌కు మతిస్థిమితం లేకపోవడం.. వంటి ఇతర కారణాల వల్ల ఈ కేసును చేధించడం‌లో ఆశించినంత స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. వారం రోజులు గడస్తున్న ఈ కేసు మిస్టరీగానే మిగిలింది. 
 

click me!