తెలంగాణలో 6 వేలు దాటిన కరోనా: కొత్తగా 352 కేసులు, ఇందులో 300 హైదారాబాద్‌లోనే

By Siva KodatiFirst Published Jun 18, 2020, 10:18 PM IST
Highlights

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 352 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది.

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా 352 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,027కి చేరింది. గురువారం వైరస్ కారణంగా ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 195కి చేరుకుంది. రాజధాని హైదరాబాద్‌లోనే 302 మందికి పాజిటివ్‌గా తేలడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది.

ఆ తర్వాత జనగాం 3, భూపాలపల్లి 2, ఖమ్మం 1, మహబూబ్‌నగర్ 2, మంచిర్యాల 4, మెదక్ 2, మేడ్చల్‌ 10, నల్గొండ 1, నిజామాబాద్ 2, రంగారెడ్డి 17, సంగారెడ్డి 2, వరంగల్ (రూ) 1, వరంగల్ (అ) 3 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 2,531 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, 3,301 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Also Read:ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎగబాకిన ఇండియా: మొత్తం 3,66,946కి చేరిన కరోనా కేసులు

కాగా, హైద్రాబాద్ సరోజిని ఆసుపత్రిలో పనిచేసే ఇద్దరు డాక్టర్లకు కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకిన వైద్యుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి.బుధవారం నాడు నిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది 66 మందికి కరోనా సోకింది. 26 మంది వైద్యులు, 40 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. 

ఇటీవల కాలంలో వైద్యులకు కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి.  ఈ పరిణామం ఆందోళన కల్గిస్తోంది. కరోనా సోకిన రోగులను క్వారంటైన్ కి తరలించారు అధికారులు. 

గత వారంలో కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండ్ కు కరోనా సోకింది. మూడు రోజుల క్రితం పేట్లబురుజు ఆసుపత్రిలో పనిచేసే 32 మందికి కరోనా సోకింది. ఇందులో 14 మంది వైద్యులు 18 మంది వైద్య సిబ్బంది. వీరిని కూడ క్వారంటైన్ కి తరలించారు

click me!