మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా ప్రచారం... మంత్రి మల్లారెడ్డి వర్గీయులపై దాడి

Arun Kumar P   | Asianet News
Published : Jun 18, 2020, 09:38 PM ISTUpdated : Jun 18, 2020, 09:42 PM IST
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా ప్రచారం... మంత్రి మల్లారెడ్డి వర్గీయులపై దాడి

సారాంశం

మేడ్చల్ జిల్లాలో మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. 

అమరావతి: మేడ్చల్ జిల్లాలో మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య ఇవాళ మేడిపల్లి ప్రాంతంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి పాల్పడటంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  

మలిపెద్ది సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చిందంటూ మల్లారెడ్డి మనుషుల ప్రచారం చేస్తున్నారట. దీంతో కోపంగా వున్న సుధీర్ రెడ్డి అనుచరులకు మల్లారెడ్డి వర్గానికి చెందిన ఘట్కేసర్ ఎంపిపి ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి దాడికి ప్రయత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.  

వీడియో

"

వివరాల్లోకి వెళితే... ప్రతాప్ సింగారం గ్రామంలో  నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరైన ఘట్కేసర్ ఎంపిపి సుదర్శన్ రెడ్డి ని సుధీర్ రెడ్డి అనుచరులు  అడ్డుకున్నారు. దీంతో ఎంపీపి అనుచరులు కూడా తిరగబడటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమయ్యింది. ఈ దాడిలో ఓ కారు స్వల్పంగా ధ్వంసమవడమే కాదు ఒకరు గాయపడ్డారు.

read more  సంచార కరోనా పరీక్షలు ఎందుకు వీలుకాదు: ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు

జెడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచర వర్గం తనపై దాడికి పాల్పడ్డారంటూ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాల పై కెసులు నమోదు చేశారు విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu