హైదరాబాద్‌లో అనూహ్యంగా పెరిగిన కేసులు.... తెలంగాణలో 6,62,202కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Sep 14, 2021, 09:47 PM IST
హైదరాబాద్‌లో అనూహ్యంగా పెరిగిన కేసులు.... తెలంగాణలో 6,62,202కి చేరిన సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 336 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 306 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,282 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 76,481 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 336 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,62,202కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు 3,898 కొవిడ్‌కు బలయ్యారు. 

ఒక్కరోజు వ్యవధిలో 306 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 6,53,022కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 5,282 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 96 కొత్త కేసులు వెల్లడి కాగా, రంగారెడ్డి జిల్లాలో 24, వరంగల్ అర్బన్ జిల్లాలో 24, కరీంనగర్ జిల్లాలో 21 కేసులు గుర్తించారు. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 1, భద్రాద్రి కొత్తగూడెం 10, జీహెచ్ఎంసీ 96, జగిత్యాల 14, జనగామ 3, జయశంకర్ భూపాలపల్లి 2, గద్వాల 1, కామారెడ్డి 2, కరీంనగర్ 21, ఖమ్మం 20, మహబూబ్‌నగర్ 4, ఆసిఫాబాద్ 0, మహబూబాబాద్ 6, మంచిర్యాల 5, మెదక్ 2, మేడ్చల్ మల్కాజిగిరి 17, ములుగు 2, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 23, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 4 , పెద్దపల్లి 12, సిరిసిల్ల 3, రంగారెడ్డి 24, సిద్దిపేట 7, సంగారెడ్డి 3, సూర్యాపేట 7, వికారాబాద్ 3, వనపర్తి 2, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 24, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున కేసులు నమోదయ్యాయి.

 

PREV
click me!

Recommended Stories

వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సూపర్ స్పీచ్ | CM Revanth Reddy Speech on Telangana Education
Hyderabad Rains : గోల్కొండ బోనాన్ని తడిపిన వానచినుకులు.. ఈ సాయంత్రం నగరంలో జోరువానలే, ఈ ప్రాంతాల్లో అలర్ట్