తెలంగాణలో మళ్లీ కలకలం: వరుసగా రెండో రోజూ 30కి పైగా కేసులు, 1,196కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : May 10, 2020, 08:28 PM ISTUpdated : May 10, 2020, 08:34 PM IST
తెలంగాణలో మళ్లీ కలకలం: వరుసగా రెండో రోజూ 30కి పైగా కేసులు, 1,196కి చేరిన సంఖ్య

సారాంశం

వరుసగా రెండో రోజు కూడా తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. శనివారం 31 కేసులు నమోదు కాగా.. తాజాగా 33 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,196కి చేరింది

వరుసగా రెండో రోజు కూడా తెలంగాణలో కరోనా కేసులు పెరిగాయి. శనివారం 31 కేసులు నమోదు కాగా.. తాజాగా 33 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,196కి చేరింది.

ఇప్పటి వరకు 751 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 415 మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:జగిత్యాలలో వృద్దుడికి కరోనా: అప్రమత్తమైన అధికారులు

మరోవైపు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపింది.  ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు లేని జిల్లాలో నాలుగు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు ఇదే జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం జనగామలో ఒక్క కేసు నమోదైంది.

ఈ జిల్లాలో కరోనా కేసులు నమోదైనవారంతా ముంబై నుండి స్వంత గ్రామాలకు వలస వచ్చినవారేనని జిల్లా అధికారులు తెలిపారు. కరోనా సోకిన రోగులు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారనే విషయమై  కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

Also Read:యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం: నాలుగు పాజిటివ్ కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ జిల్లాలో ఒక్క కేసు కూడ నమోదు కాలేదు.ఈ జిల్లా హైద్రాబాద్ కు అతి సమీపంలో ఉంది. ఈ జిల్లాలో ఒక్క కేసు కూడ నమోదు కాకుండా జిల్లా కలెక్టర్ జాగ్రత్తలు తీసుకొంది. అయితే ముంబై నుండి వచ్చిన వారితో ఈ జిల్లాలో కేసులు నమోదు కావడం ప్రస్తుతం జిల్లా యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం