యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం: నాలుగు పాజిటివ్ కేసులు

Published : May 10, 2020, 02:58 PM ISTUpdated : May 10, 2020, 04:43 PM IST
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా కలకలం: నాలుగు పాజిటివ్ కేసులు

సారాంశం

యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు లేని జిల్లాలో నాలుగు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

భువనగరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు లేని జిల్లాలో నాలుగు కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.

జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో వైపు ఇదే జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం జనగామలో ఒక్క కేసు నమోదైంది. ఈ జిల్లాలో కరోనా కేసులు నమోదైనవారంతా ముంబై నుండి స్వంత గ్రామాలకు వలస వచ్చినవారేనని జిల్లా అధికారులు తెలిపారు.

also read:మంచిర్యాల జిల్లాలో ముగ్గురు వలస కూలీలకు కరోనా పాజిటివ్

కరోనా సోకిన రోగులు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారనే విషయమై  కూడ అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

also read:జగిత్యాలలో వృద్దుడికి కరోనా: అప్రమత్తమైన అధికారులు

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఈ జిల్లాలో ఒక్క కేసు కూడ నమోదు కాలేదు.ఈ జిల్లా హైద్రాబాద్ కు అతి సమీపంలో ఉంది. ఈ జిల్లాలో ఒక్క కేసు కూడ నమోదు కాకుండా జిల్లా కలెక్టర్ జాగ్రత్తలు తీసుకొంది.

అయితే ముంబై నుండి వచ్చిన వారితో ఈ జిల్లాలో కేసులు నమోదు కావడం ప్రస్తుతం జిల్లా యంత్రాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. 


 

PREV
click me!

Recommended Stories

THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
BIG BREAKING: మహిళా MLA అని కూడా చూడకుండా.. అసెంబ్లీ వద్ద తీవ్ర రచ్చ! 🚨