హైదరాబాద్‌లో 30 ఏళ్ల లేబర్ బ్రెయిన్ డెడ్ అయింది. కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేశారు. అవయవదానానికి ఆయన భార్య, తల్లిదండ్రులు సమ్మతించారు.
హైదరాబాద్: 30 ఏళ్ల కార్మికుడి బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి అవయవాలను దానం చేశారు. జీవన్‌దాన్ ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ద్వారా ఈ అవయవదానం జరిగింది.
ముషీరాబాద్‌లో జవహర్ నగర్‌లో 30 ఏళ్ల పోటకారి రాజేశ్ నివసిస్తుండేవాడు. ఏప్రిల్ 12వ తేదీన ఆయనకు ఒంట్లో నలతగా అనిపిచింది. ఆ తర్వాత ఇంటిలోనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు రాజేశ్‌ను ఎల్బీ నగర్‌లోని కామినేని హాస్పిటల్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ రాజేశ్‌కు 72 గంటలపాటు క్రిటికల్ ఇంటెన్సివ్ కేర్ అందించారు.
కానీ, రాజేశ్ ఆరోగ్యంలో మాత్రం మెరుగుదల కనిపించలేదు. ఏప్రిల్ 15వ తేదీన రాజేశ్ బ్రెయిన్ డెడ్ అయినట్టు న్యూరోఫిజీషియన్ల టీమ్ ప్రకటించింది. హాస్పిటల్ సిబ్బంది, జీవన్‌దాన్ కోఆర్డినేటర్లు కలిసి రాజేశ్ కుటుంబ సభ్యులుకు పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం, అవయవదానం చేయడానికి రాజేశ్ కుటుంబం అంగీకరించింది.
Also Read: యూఏఈ విజిట్ వీసా నిబంధనలు కఠినతరం.. విజిట్ పై వెళ్లాక వర్క్ వీసా ఇస్తామంటే జాగ్రత!
రాజేశ్ అవయవాలను దానం చేయడానికి ఆయన భార్య పోటకారి శాలిని, తండ్రి పోటకారి మోసెస్, ఆయన తల్లి సమ్మతం తెలిపారు. సర్జన్లు రాజేశ్ బాడీ నుంచి రెండు కిడ్నీలను, కార్నియాలను సేకరించారు.ఆర్గాన్ డొనేషన్ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ అవయవాలను అవసరార్థులకు కేటాయించామని వివరించారు.