తెలంగాణలో తెరిపినిచ్చిన కరోనా: ఇవాళ మూడే కేసులు.. అన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే

By Siva KodatiFirst Published May 4, 2020, 9:24 PM IST
Highlights

తెలంగాణలో కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కొత్తగా ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1,085కి చేరింది

తెలంగాణలో కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కొత్తగా ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1,085కి చేరింది.

సోమవారం నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇవాళ 40 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 585కి చేరింది. వైరస్ కారణంగా మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోగా.. 471 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read:కరోనాతో సహజీవనం: కేటీఆర్ నోట వైఎస్ జగన్ మాట

హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. వనస్థలిపురంలో ఎనిమిది  కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చారు.

ఆదివారం వనస్థలిపురంలోని మూడు కుటుంబాల్లో 9 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిని ఆసుపత్రికి తరలించారు. హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్, సాహెబ్ నగర్ రోడ్డు, ఏబీ టైప్ కాలనీలు, ఎస్ కే డీ నగర్, ఫేజ్ 1 కాలనీ, సచివాలయనగర్ లను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు.

Also Read:కరోనా అలారం వాచ్: తెలంగాణ చిన్నారి అద్భుత ఆవిష్కరణ

ఈ ప్రాంతంలోని 169 మందిని క్వారంటైన్ కు తరలించారు. కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో సోమవారం నుండి వారం రోజుల పాటు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. ఈ ప్రాంతాల్లో కఠినంగా నిబంధనలను అమలు చేయనున్నారు.

రైతు బజార్, పండ్లు, ఇతర మార్కెట్లను పూర్తిగా మూసివేస్తామని అధికారులు స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు ముందుజాగ్రత్తగా కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు.  

click me!