తెలంగాణలో కరోనా విశ్వరూపం: కొత్తగా 209 కేసులు, 9 మరణాలు.. 4,320కి చేరిన సంఖ్య

By Siva Kodati  |  First Published Jun 11, 2020, 9:59 PM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గురువారం కొత్తగా 209 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,320కి చేరుకుంది.


తెలంగాణలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గురువారం కొత్తగా 209 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,320కి చేరుకుంది.

మరోవైపు ఇవాళ కోవిడ్ 19తో 9 మంది మరణించడంతో మృతుల సంఖ్య 165కి చేరింది. గురువారం ఒక్క హైదరాబాద్‌లోనే 175 కేసులు నమోదు కావడంతో భాగ్యనగర వాసులు ఉలిక్కిపడ్డారు.

Latest Videos

undefined

Also Read:తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం... 84మందికి పాజిటివ్

రాజధాని తర్వాత వరుసగా మేడ్చల్‌లో 10, రంగారెడ్డిలో 7, వరంగల్ అర్బన్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 3, అసిఫాబాద్, సిద్ధిపేటలో రెండేసి చొప్పున, కరీంనగర్లో 3, ములుగు, కామారెడ్డి, వరంగల్, సిరిసిల్లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 1,993 మంది కోలుకోగా.. 2,162 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా 84మంది పోలీస్ అధికారులకు కరోనా సోకింది. ఇలా పోలీస్ శాఖలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారు విధులకు హాజరు కావద్దని...  ఇంటివద్దే విశ్రాంతి తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డి ప్రకటించారు.

కరోనా పోరాటంలో ప్రంట్ లైన్ వారియర్స్  గా పోలీసులు ఎంతో సాహసోపేతంగా  విధులు నిర్వహించారు. యావత్ దేశం కరోనాకు భయపడి ఇళ్లకే పరిమితమైనా పోలీసులు మాత్రం తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా రోడ్లపైనే  విధులు నిర్వహించారు. ఇలా ప్రజలను కరోనా నుండి  కాపాడే ప్రయత్నంలో కొందరు పోలీసులే దాని బారిన పడ్డారు.

Also Read:గాంధీలో కరోనా రోగి మృతదేహం మిస్సింగ్... 12 గంటల పాటు వెతుకలాట, చివరికి

పోలీసులు, వైద్యులతో పాటు కరోనా విజృంభణ సమయంలోనూ విధులు నిర్వహించారు జర్నలిస్ట్ లు. ఈ మహమ్మారికి సంబంధించిన వార్తలను సేకరించడానికి క్లిష్టమైన సమయాల్లోనూ వీరు విధులు నిర్వహించారు. దీంతో ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు 16మంది జర్నలిస్ట్ లకు కరోనా సోకింది. వారు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

click me!