కొత్త సచివాలయం నిర్మాణం: గ్రానైట్, మార్బుల్స్ మోడల్స్‌‌కు కేసీఆర్ ఆమోదముద్ర

By Siva KodatiFirst Published Dec 9, 2021, 7:14 PM IST
Highlights

సచివాలయ నిర్మాణ పనుల్ని (new secretariat construction)  త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) . అలాగే ఎలివేషన్, ఫైనల్ వర్క్స్‌పై సూచనలు చేశారు కేసీఆర్. దీనితో పాటు సచివాలయం బయటి గోడల డిజైనింగ్ పరిశీలించారు సీఎం. ఈ సందర్భంగా గ్రానైట్, మార్బుల్స్ మోడల్స్‌ను ఫైనల్ చేశారు కేసీఆర్. 

సచివాలయ నిర్మాణ పనుల్ని (new secretariat construction)  త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) . గురువారం కొత్త సచివాలయ నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం పనులు వేగం తగ్గకుండా చూడాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని.. ఇతర రాష్ట్రాల్లోని సచివాలయ నిర్మాణాలను పరిశీలించాలని కేసీఆర్ సూచించారు. దేశం గర్వించేలా సచివాలయ నిర్మాణం వుండాలని ఆదేశించారు. అలాగే ఎలివేషన్, ఫైనల్ వర్క్స్‌పై సూచనలు చేశారు కేసీఆర్. దీనితో పాటు సచివాలయం బయటి గోడల డిజైనింగ్ పరిశీలించారు సీఎం. ఈ సందర్భంగా గ్రానైట్, మార్బుల్స్ మోడల్స్‌ను ఫైనల్ చేశారు కేసీఆర్. 

 

 

కాగా.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వంపై (telangana govt) జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) (national green tribunal) మండిపడిన సంగతి తెలిసిందే. కొత్తగా నిర్మించే సచివాలయం కోసం పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో టీపీసీసీ చీఫ్ (tpcc) రేవంత్‌రెడ్డి (revanth reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై ఇప్పటివరకు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రశ్నించింది.

Also Read:చాలా రోజుల తర్వాత సచివాలయానికి కేసీఆర్.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనుల పరిశీలన

పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే కేసీఆర్( kcr) ప్రభుత్వం పాత సచివాలయం కూలగొట్టి కొత్త సచివాలయం (telangana secretariat demolition ) నిర్మిస్తోందని గతంలో రేవంత్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసహనం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారో లేదో వెంటనే తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం మరో మూడు వారాల పాటు గడువు విధించింది. 

 

 

ఇకపోతే.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాత సచివాలయ భవనం కూల్చివేత, నూతన భవన నిర్మాణంపై కాంగ్రెస్ (congress) ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో అక్టోబర్  15న విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వడంతో పాటు సచివాలయ నిర్మాణంలో యథాతథస్థితిని పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఈ పిటిషన్ ద్వారా కోరాడు. అంతేకాకుండా పర్యావరణ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశించాలని కోరారు.

 

click me!