తెలంగాణలో 30 వేలకు చేరువలో కరోనా: కొత్తగా 1,924 కేసులు, 11 మంది మృతి

Siva Kodati |  
Published : Jul 08, 2020, 10:08 PM IST
తెలంగాణలో 30 వేలకు చేరువలో కరోనా: కొత్తగా 1,924 కేసులు, 11 మంది మృతి

సారాంశం

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 1,924 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29,536కి చేరుకుంది. 

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 1,924 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29,536కి చేరుకుంది.

ఇవాళ రికార్డు స్థాయిలో 11 మంది మరణించడంతో వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 324కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 11,933 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 17,279 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం ఒక్క హైదరాబాద్‌లోనే 1,590 మందికి పాజిటివ్‌గా తేలింది.

Also Read:లైవ్ డ్యాష్ బోర్డుల ఏర్పాటు: హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ఏజీ

ఆ తర్వాత రంగారెడ్డి 99, మేడ్చల్‌ 43, సంగారెడ్డి 20, వరంగల్ 26, నిజామాబాద్ 19, మహబూబ్‌నగర్ 15, కరీంనగర్ 14, వనపర్తి 9, సూర్యాపేట 7, మెదక్, పెద్దపల్లి, యాదాద్రి‌లలో ఐదేసి కేసులు, ఖమ్మం 4, కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూలులో మూడేసి కేసులు, ఆసిఫాబాద్, నారాయణపేటలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. 

కాగా ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేందర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరి తీసుకోవడంలో నాగేందర్ ఇబ్బంది పడుతున్నారని, అందుకోసమే ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.

Also Read:25 మందికి కరోనా: జూలై 9 నుండి తెలంగాణ హైకోర్టు మూసివేత

ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నట్టుగా తెలియవస్తుంది. ప్రభుత్వాసుపత్రి మీద నమ్మకం ఉండబట్టే ఆయన గాంధీకి చికిత్స కోసం వచ్చినట్టు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu