తెలంగాణలో 27 వేలు దాటిన కరోనా: కొత్తగా 1,879 కేసులు, ఏడుగురి మృతి

Siva Kodati |  
Published : Jul 07, 2020, 10:23 PM ISTUpdated : Jul 08, 2020, 05:53 PM IST
తెలంగాణలో 27 వేలు దాటిన కరోనా: కొత్తగా 1,879 కేసులు, ఏడుగురి మృతి

సారాంశం

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం కొత్తగా 1,879 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 27,612కి చేరింది

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం కొత్తగా 1,879 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 27,612కి చేరింది. ఇవాళ వైరస్ కారణంగా ఏడుగురు మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 313కి చేరుకుంది.

Also Read:హైదరాబాద్‌లో కార్పోరేట్ ఆసుపత్రుల దందా.. కరోనా రోగులతో వ్యాపారం

మంగళవారం ఒక్క హైదరాబాద్‌లోనే 1,422 కోవిడ్ 19 కేసులు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్‌లో 94 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 11,012 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స  పొందుతుండగా... 16,287 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల దందాపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలోని కేర్, యశోదా, సన్‌షైన్, మెడికవర్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. ఎంత ఛార్జీలను వసూలు చేయాలో ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ.. ఆసుపత్రులు పట్టించుకోకపోవడం దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Also Read:కేసీఆర్ కు కరోనా సోకిందనుకొని ప్రేయర్ చేసిన కేఏ పాల్

నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై 14వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

PREV
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu