పక్కింటి బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్...

By SumaBala BukkaFirst Published Nov 28, 2022, 8:01 AM IST
Highlights

పక్కింటి బాలికకు మాయమాటలు చెప్పి పదే పదే అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్ : బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం. ఎల్బీనగర్ పరిధిలోని ఓ కాలనీలో బాలిక (17) కుటుంబం ఉంటోంది.. వాళ్ళ పక్క ఇంట్లో ఉంటున్న ఓ యువకుడు (26) బాలికకు మాయమాటలు చెప్పి కొంత కాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన బాలిక తల్లి ఆరా తీయగా.. ఆ ప్రబుద్ధుడి నిర్వాకం బయట పడింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. 

ఇదిలా ఉండగా, ఈ నెల 25న ఇలాంటి ఓ దారుణ ఘటన దానికి పంచాయతీ పెద్దలు విధించిన శిక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్లో ఓ పంచాయతీ పెద్దలు అత్యాచార నిందితుడికి విధించిన శిక్ష.. న్యాయాన్ని అవహేళన చేసేలా ఉంది. కొన్నేళ్ళ క్రితం ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న పంచాయతీ పెద్దలు ఘటనను బయటికి రాకుండా చేసేందుకు ప్రయత్నించారు. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష విధించి అతడిని వదిలి పెట్టడం గమనార్హం. నవాదా ప్రాంతంలోని ఓ గ్రామంలో.. అరుణ్ పాండ్యన్ అనే వ్యక్తి కోళ్ల ఫారంలో పని చేసేవాడు. కొన్నాళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఆశ చూపి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

నేడు నిర్మల్ నుండి ప్రారంభంకానున్న బండి సంజ‌య్ 'ప్రజా సంగ్రామ యాత్ర'

దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరగా.. కోళ్ల ఫారం యజమాని జోక్యం చేసుకుని ఆ విషయాన్ని పంచాయతీలో తేల్చుకోవాలని సూచించాడు. పంచాయతీ పెద్దలు నిందితుడికి గ్రామస్తులందరి ముందు 5 గుంజీలను శిక్షగా విధించి అతడిని విడిచి పెట్టారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఆ పంచాయతీ తీర్పు మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్ళింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇలాంటి ఘటనలో బెంగళూరు కోర్టు ఓ వ్యక్తికి మరణశిక్ష విధించింది. ఐదేళ్ల బాలుడిపై అసహజ లైంగిక దాడికి పాల్పడి,  హత్య చేశాడో దుర్మార్గుడు. మూర్తి అనే ఆ నిందితుడికి బెంగళూరులోని ఒకటో ఫాస్ట్ ట్రాక్ కోర్టు గత శుక్రవారం మరణశిక్ష విధించింది. మృతుని కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల పరిహారాన్ని ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని బెంగళూరు న్యాయ సేవల ప్రాధికార సంస్థకు న్యాయమూర్తి కె.ఎన్.రూప సూచించారు. నిందితుడికి రూ.50వేల  జరిమానా విధించారు. 

మైనర్లపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షలు విధించాలన్న చట్టం వచ్చి పదేళ్లు అవుతున్నా.. ఇప్పటి వరకు అలా జరగలేదని ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. కఠిన శిక్షలతోనే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని అన్నారు. నిందితుడు 2015 సెప్టెంబర్ 12న లైంగికత దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాలుడు కేకలు వేయడంతో తలపై బండరాయితో మోది హత్య చేశాడు.

click me!