ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నాం... తరలిరండి : కేటీఆర్

First Published Aug 7, 2018, 5:43 PM IST
Highlights

చేనేత కళాకారులకు అండగా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇ కామర్స్ రంగం కొత్తపుంతలు తొక్కుతూ విస్తృత మార్కెటింగ్ ని కలిగివుందని, అందువల్ల చేనేత వస్త్రాలను ఆన్ లైన్ లో అమ్మకాలు జరపడానికి వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇవాళ సాయంత్రం చేనేత ప్యాషన్ షో నిర్వహించనున్నట్లు ప్రకటించిన మంత్రి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 
 
ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం సందర్బంగా పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన  కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ...తమది చేతల ప్రభుత్వంతో పాటు చేనేతల ప్రభుత్వమని అన్నారు. నేతన్నల కోసం రూ.400 కోట్ల నిధులు కేటాయించి వారిపై ఉన్న ప్రేమను ముఖ్యమంత్రి కేసీఆర్ చాటుకున్నారని అన్నారు. 

నేతన్నల ఆర్థిక స్థితిగతులను గుర్తించే చేనేత మిత్ర పథకాన్ని రూపొందించామని అన్నారు. చేనేత కార్మికులు ఈ పథకం ఎప్పుడైనా చేరొచ్చని, ప్రభుత్వం అందించే ప్రోత్సాహక నగదు నేరుగా వారి ఖాతాలోనే చేరుతుందని కేటీఆర్ వివరించారు. 

ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం నేత కార్మికుల చేయూత కోసమే రూ.60 కోట్ల నిధులు కేటాయించామని అన్నారు. కేంద్రంతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వమే చేనేత రంగానికి అధిక నిధులు కేటాయిస్తోందని గుర్తు చేశారు. చేనేతపై ఆధారపడి జివీస్తున్న దాదాపు 42 వేల మందికి అండగా ఉంటూ, వారికి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

click me!