కల్లుతాగి 15 మందికి అస్వస్థత.. హాస్పిటల్ కు తరలింపు..

Published : Dec 29, 2021, 08:50 AM IST
కల్లుతాగి 15 మందికి అస్వస్థత.. హాస్పిటల్ కు తరలింపు..

సారాంశం

కల్తీ కల్లు తాగడంతో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారంతా ప్రస్తుతం హైదరాబాదులోని పలు హస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

క‌ల్తీ క‌ల్లుతాగ‌డంతో 15 మంది హాస్పిట‌ల్ పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో జ‌రిగింది. శివంపేట‌లోని కొంతాన్ ప‌ల్లికి చెందిన ఓ వ్య‌క్తి తెల్ల‌క‌ల్లు విక్ర‌యిస్తుంటాడు. అత‌డి గ్రామంతో పాటు తుఫ్రాన్ మండ‌లం వ‌ట్టూర్‌లోనూ తెల్ల‌క‌ల్లు విక్ర‌యిస్తాడు. అయితే అత‌డి వ‌ద్ద క‌ల్లు తాగిన ఆయా గ్రామాల్లోని ప్ర‌జల ఆరోగ్యం ఒక్క‌సారిగా చెడిపోయింది. విప‌రీతంగా వాంతులు చేసుకున్నారు. ప‌క్ష‌వాతం వ‌చ్చిన విధంగా చేతులు, కాళ్లు వంక‌పోయాయి. దీంతో వారంద‌రినీ ఆయా కుటుంబ స‌భ్యులు, స్థానికులు వెంన‌టే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు. స్థానిక హాస్పిట‌ల్స్ తీసుకెళ్లి చికిత్స అందించే క్ర‌మంలో వారి ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. దీంతో వారంద‌రినీ హైద‌రాబాద్‌కు తీసుకెళ్లారు. క‌ల్లు తాగిన వారిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. క‌ల్లులో కెమిక‌ల్స్ అధిక మోతాదులో క‌ల‌ప‌డం వ‌ల్లే ఇలాంటి స‌మ‌స్య త‌లెత్తి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు ప్రాథ‌మికంగా అంచ‌నాకు వ‌చ్చారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించి అందులో కెమిక‌ల్స్ క‌లిపిన‌ట్టు రుజువు అయితే క‌ల్లుబ‌ట్టి నిర్వాకుడిపై చ‌ట్ట‌రీత్యా చర్య‌లు తీసుకుంటామ‌ని అబ్కారీ అధికారులు తెలిపారు.

గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అదృశ్యం.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి

 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్