బుక్‌ఫెయిర్‌లో యువత.. ఇక పుస్తకం సజీవంగానే వుంటుంది: జస్టిస్ ఎన్వీ రమణ

Siva Kodati |  
Published : Dec 28, 2021, 10:01 PM IST
బుక్‌ఫెయిర్‌లో యువత.. ఇక పుస్తకం సజీవంగానే వుంటుంది: జస్టిస్ ఎన్వీ రమణ

సారాంశం

ప్రస్తుతం సెల్‌ఫోన్‌ హస్తభూషణంగా మారిందని, యువతరం పుస్తక ప్రదర్శనకు రావడంతో ఆశలు చిగురించాయని ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు. పుస్తకం సజీవంగా ఉంటుందనే నమ్మకం కలిగిందని ఆయన అన్నారు. రోజూ 2 నుంచి 3 గంటల పాటు గ్రంథాలయంలో పుస్తకాలు చదివానని జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు.

వ్యాయామం, పుస్తక పఠనం మనలో ఎంతో మార్పు తెస్తాయని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన 34వ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శన (hyderabad book fair) ముగింపు కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంటినే గ్రంథాలయంగా మార్చిన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకికి చెందిన కూరెళ్ల విఠలాచార్యను సీజేఐ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సెల్‌ఫోన్‌ హస్తభూషణంగా మారిందని, యువతరం పుస్తక ప్రదర్శనకు రావడంతో ఆశలు చిగురించాయని ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు. 

పుస్తకం సజీవంగా ఉంటుందనే నమ్మకం కలిగిందని ఆయన అన్నారు. రోజూ 2 నుంచి 3 గంటల పాటు గ్రంథాలయంలో పుస్తకాలు చదివానని జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తుచేసుకున్నారు. జీవితంలో పైకి రావటానికి అప్పటి జ్ఞానం ఎంతో ఉపపయోగపడిందని సీజేఐ వెల్లడించారు. ప్రస్తుతం పాఠశాలలు,  కళాశాలల్లో లైబ్రరీ, మైదానం నిబంధన ఎవరూ పాటించట్లేదని ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పలు బుక్‌ స్టాళ్లను జస్టిస్‌ ఎన్వీ రమణ సందర్శించి .. కొన్ని పుస్తకాలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో చిన్నారులు కనిపించడంతో వారితో కాసేపు మాట్లాడి.. సెల్ఫీలు దిగారు.  

ALso Read:న్యాయవాదులు సమాజానికి మార్గదర్శకులు: సీజేఐ ఎన్వీ రమణ

కాగా.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా AP High court  Bar అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV Ramana దంపతులకు  సన్మానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. ప్రజల హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

సమాజ శ్రేయస్సు కోసం న్యాయవాదులు  తమ శక్తియుక్తులను ఉపయోగించాలన్నారు.హైకోర్టుల్లో  పెండింగ్ లో ఉన్న కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. అంతే కాదు న్యాయమూర్తుల కొరత కూడా ఉందని  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పారు. అయితే వీటి సమస్య కోసం పరిష్కరించే ప్రయత్నిస్తామన్నారు. వీలైనంత త్వరలోనే న్యాయమూర్తుల కొరతను  తీర్చనున్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!