ఒకే రోజు 8 మరణాలు, 143 కేసులు: తెలంగాణపై కరోనా పంజా, 3,290 కి చేరిన సంఖ్య

By Siva Kodati  |  First Published Jun 5, 2020, 9:15 PM IST

తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా వందకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం 143 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.


తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. గత కొన్ని రోజులుగా వందకు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం 143 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌లో 5, వరంగల్‌లో 3, ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్‌లో రెండేసి కేసుల చొప్పున, మంచిర్యాలలో ఒక కేసు నమోదయ్యాయి. కాగా శుక్రవారం 8 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 113కి చేరింది.

Latest Videos

undefined

Also Read:భార్యకు చెప్పకుండా భర్త అంత్యక్రియలు: హైకోర్టుకు తెలంగాణ సర్కార్ చెప్పింది ఇదీ...

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,290కి చేరింది. వీరిలో 448 విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చినవారు, వలస కార్మికులు వున్నారు. ఇక రాష్ట్రంలో 1,627 మంది కోవిడ్ 19 నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1,550 మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా నియంత్రణ చర్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందన్నారు ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే కాలంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచుతామని ఈటల స్పష్టం చేశారు.

Also Read:ప్రైవేట్ స్కూల్స్ హాస్టల్స్‌కు అనుమతి: టెన్త్ పరీక్షలపై హైకోర్టుకు తెలంగాణ సర్కార్

గాంధీ వైద్యుల సేవలు, కృషిని అందరూ అభినందించాలని వృద్ధులు, చిన్నారులు కూడా గాంధీలో చికిత్స తర్వాత కోలుకున్నారని మంత్రి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇంతటి సేవలు అందిస్తున్న వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని కాపాడుకోవాల్సిన అవసరం వుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

కోవిడ్ 19 ఆసుపత్రుల్లో రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని... గాంధీ, నీలోఫర్, పేట్ల బురుజు, సుల్తాన్‌పూర్‌ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించామని రాజేందర్ స్పష్టం చేశారు. కరోనా బాధితుల ప్రాణాలు నిలబెట్టేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల రాజేందర్ వెల్లడించారు.

click me!