తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ జాగ్రత్తలు చేపట్టింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జేఎన్.1 కరోనా వైరస్ కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కూడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. హైద్రాబాద్ నాంపల్లి ఆగాపురలో 14 నెలల చిన్నారికి కరోనా సోకింది.ఈ విషయాన్ని హైద్రాబాద్ నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. తెలంగాణ రాష్ట్రంలో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
హైద్రాబాద్ , మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 మందికి నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
also read:కరోనా జేఎన్.1 వైరస్: ప్రజారోగ్యానికి ముప్పుందా? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే?
నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 14 నెలల చిన్నారికి కరోనా సోకిందని శుక్రవారంనాడు వైద్యులు ప్రకటించారు.ఈ చిన్నారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.
ప్రపంచంలోని 38 దేశాల్లో జేఎన్.1 కరోనా కేసులు నమోదయ్యాయి. జేఎన్. 1 కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వైరస్ కారణంగా ప్రజారోగ్యానికి అంతగా ముప్పు లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 19న ప్రకటించింది.
also read:గోవాలో 19 జేఎన్.1 కరోనా వైరస్ కేసులు: వైద్య శాఖ అలెర్ట్
ఈ నెల 8వ తేదీన కేరళ రాష్ట్రంలోని జేఎన్.1 వైరస్ కేసు తొలుత నమోదైంది.కేరళ తో పాటు గోవా, కేరళ, మహారాష్ట్రల్లో కూడ ఈ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడ ఈ కేసులు ఇప్పటికే 19 రికార్డయ్యాయి. దేశంలో జేఎన్.1 కరోనా వైరస్ కేసులు నమోదౌతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అలెర్ట్ చేసింది కేంద్ర వైద్య , ఆరోగ్య శాఖ. కరోనా కేసుల సంఖ్యను పెంచాలని సూచించింది. కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా గతంలో తీసుకున్నట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. మరోవైపు ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్స కోసం ఏర్పాట్లను చేయాలని కూడ ఆదేశించింది.