ముఖ్యమంత్రి రేవంత్ టీమ్ లో అజిత్ రెడ్డి ... ఇంతకీ ఎవరితను?

By Arun Kumar P  |  First Published Dec 22, 2023, 7:34 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓఎస్డీగా డిఫెన్స్ సర్వీసెస్ కు చెందిన అజిత్ రెడ్డి నియమితులయ్యారు. 


హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత టీమ్ ను రెడీ చేసుకుంటున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను బదిలీచేసి కొత్తవారిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా కొత్తవారిని నియమిస్తోంది ప్రభుత్వం. తాజాగా ముఖ్యమంత్రి ఓఎస్డిగా అజిత్ రెడ్డి నియమితులయ్యారు.  ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసారు. 

ఎవరీ అజిత్ రెడ్డి? 

Latest Videos

ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ కు చెందిన అజిత్ రెడ్డి గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారిగా పనిచేసారు. అలాగే ఆగ్రా కంటోన్మెంట్ లోనూ పనిచేసారు. ప్రస్తుతం బెంగళూరులో అదనపు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇలా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న ఆయన డిప్యుటేషన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డి గా పనిచేయనున్నారు. 

Also Read  Revanth Reddy: నేడు ఇందిరాపార్క్ లో సీఎం రేవంత్ ధర్నా.. ఎందుకంటే..

ఇక కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్న మరికొందరు అధికారులను కూడా తన టీమ్ లో చేర్చుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. జిహెచ్ఎంసి మాజీ కమీషనర్ లోకేష్ కుమార్, మాణిక్ రాజ్ లను ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులుగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కుమార్ ఎలక్షన్ కమీషన్ లో,  మాణిక్ రాజ్ కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేస్తున్నారు. 

click me!